రైతులు పండించిన ప్రతి చివరి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది

  • కాంగ్రెస్ సర్కార్ రైతు పక్షపాతి  
  • వెంకటాపూర్‌లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
  • నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజల హరికృష్ణ 

రైతులు పండించిన ప్రతి చివరి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది

సిద్దిపేట:

రైతులు పండించిన ప్రతి చివరి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని, ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని 
నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజల హరికృష్ణ సూచించారు. సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజల హరికృష్ణ శుక్రవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు.ఐకేపీ కేంద్రాల్లో రైతులకు అవసరమైన నీడ, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. తేమ శాతం నిర్దేశిత స్థాయికి చేరగానే వడ్లను వెంటనే పారదర్శకంగా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, తేమ కొలిచే పరికరాలు, కాంటాలు, వర్షాల వల్ల ధాన్యం తడవకుండా తార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవి, ఉప సర్పంచ్ సుమన్, వార్డ్ సభ్యులు గజ్జల స్వామి, ఎర్ర కృష్ణ, సత్తవ్వ, చామంతి, ఎర్ర ప్రభాకర్, నాగరాజు, బండ చంద్రకళ, గ్రామ శాఖ అధ్యక్షులు దుబ్బ దుర్గయ్య, ఎండీ రాజ్ మహమ్మద్, పోతుగంటి శ్రీకాంత్, ఏఈఓ రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు అంజిరెడ్డి, గుర్రం అంజిరెడ్డి, దాస్ అంజన్న, డీసీసీ బుడ్డమ్మ లక్ష్మి, అల్ల శ్రీనివాస్ రెడ్డి, పంతం శ్రీనివాస్ పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-24 at 19.23.30

About The Author