నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకోవాలి
- రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శివ కుమార్
సిద్దిపేట:
నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శివ కుమార్ అన్నారు.
ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ శివకుమార్
మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్ రెడ్డి పై కొంతమంది వ్యక్తులు ప్రత్యేకించి మేడ్చల్ జిల్లా కొర్రెముల గ్రామ నివాసి శ్రీకాంత్ చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యమని, క్రీడా అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుల ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ప్రచారం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. మద్ది మహేందర్ రెడ్డి గారు కబడ్డీ క్రీడా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో క్రీడాకారులకు అనేక అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమని, ఇది క్రీడా వాతావరణాన్ని దెబ్బతీసే చర్య అని అన్నారు. అలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. కబడ్డీ క్రీడను అభివృద్ధి చేయడంలో అసోసియేషన్ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, యువ ప్రతిభా క్రీడాకారుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని శివ కుమార్ స్పష్టం చేశారు.
