కేసీఆర్‌పై బురద చల్లాలని చూసిండ్రు

  • కానీ వారి ముఖాలపైనే పడింది
  • కాళేశ్వరం తీర్పుతో ధర్మం గెలిచింది
  • ఇది తెలంగాణ ప్రజల విజయం
  • మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

కేసీఆర్‌పై బురద చల్లాలని చూసిండ్రు

అమీన్‌పూర్:

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నైతిక విజయం సాధించారని అమీన్‌పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు అనంతరం బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు పై బురద చల్లాలని చూస్తోందని, కానీ న్యాయస్థానం తీర్పుతో అది సాధ్యం కాదని తేలిపోయిందని తుమ్మల పాండురంగారెడ్డి విమర్శించారు. చట్టవిరుద్ధమైన పద్ధతుల్లో కమిషన్లు వేసి ఇబ్బంది పెట్టాలని చూస్తే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదని ఈ తీర్పు రుజువు చేసిందన్నారు. కేసీఆర్ తెలంగాణ బాగు కోసం రేయింబవళ్లు శ్రమించి కాళేశ్వరం వంటి అద్భుత ప్రాజెక్టును నిర్మించారని, ఆయన చిత్తశుద్ధిని శంకించడం ఎవరి తరమూ కాదని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే అమీన్‌పూర్ పరిధిలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. "సత్యం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంపై మాకు, ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేక చేస్తున్న ఇలాంటి కుట్రలను ప్రజలే తిప్పికొడతారు" అని  పాండురంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గొంతు ఎండిపోకుండా భగీరథ ప్రయత్నం చేసిన నాయకుడు కేసీఆర్. హైకోర్టు తీర్పుతో అసలు నిజం నిగ్గుతేలింది. ఇది తెలంగాణ ప్రజల విజయంమని అభివర్ణించారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ కృష్ణ, కల్పన ఉపేందర్ రెడ్డి, కొల్లూరు చంద్రకళ గోపాల్,తదితరులు పాల్గొన్నారు.

About The Author