బూత్ ఏజెంట్లే పార్టీకి పునాది: మధుయాష్కి గౌడ్
- త్వరలో జరిగే ఓటరు జాబితా సవరణపై దృష్టి పెట్టాలి*
- ఎల్బీనగర్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో వెల్లడి*
ఎల్బీనగర్:
బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసినప్పుడే రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పటిష్టమవుతుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. గురువారం హయత్ నగర్ టీ నగర్ లోని క్యాంప్ కార్యాలయంలో ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలతో బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) ఎంపికపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్ పాల్గొన్నారు.
ఓట్ల తొలగింపుపై అప్రమత్తత అవసరం
కష్టపడే వారికే ప్రాధాన్యం: మల్రెడ్డి రాంరెడ్డి
పార్టీకి బూత్ ఏజెంట్లు వెన్నెముక వంటి వారని మల్రెడ్డి రాంరెడ్డి అన్నారు. నిబద్ధతతో పనిచేసే వారినే ఏజెంట్లుగా నియమించాలని నేతలకు సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలంటే బూత్ స్థాయి నుంచే బలమైన పునాది వేయాలన్నారు.
అన్ని వర్గాలను సమైక్యం చేయడమే 'సంఘటన్ శ్రీజన్' ముఖ్య ఉద్దేశమని వెన్నెల గద్దర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతుందని, బూత్ ఏజెంట్ల నియామకాన్ని త్వరగా పూర్తి చేసి జాబితాను పీసీసీకి పంపాలని కోరారు.
ఈ సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ, మహిళా విభాగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
