రాహుల్ గాంధీని కలిసిన ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్*
న్యూఢిల్లీ:
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ గురువారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని 10 జన్ పథ్ నివాసంలో రాహుల్‌ను ఆయన కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు పది నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో అనిల్‌కుమార్ యాదవ్ తన భార్య, పిల్లలను రాహుల్‌కు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా అనిల్ యాదవ్ పిల్లలతో రాహుల్ గాంధీ సరదాగా ముచ్చటించారు. వారి పేర్లు అడిగి తెలుసుకున్న ఆయన.. "మీ తాత, తండ్రి మాదిరిగానే మీరు కూడా భవిష్యత్తులో ప్రజాసేవలోకి వస్తారా?" అని ప్రశ్నించారు. ఎంపీ కుటుంబ సభ్యులతో రాహుల్ ఎంతో ఆత్మీయంగా గడిపారు.
