పేదల పథకానికి పాతరేస్తున్న కేంద్రం

  • కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ
  •  కాంగ్రెస్ నేత కమలాకర్ ఆరోపణ

పేదల పథకానికి పాతరేస్తున్న కేంద్రం

సిద్దిపేట:

కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకుసిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలంలోని పోతారెడ్డిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఏలూరి కమలాకర్ మాట్లాడుతూ.. గతంలో కరువు పరిస్థితులు, ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, ఉపాధి కోసం వలసలు వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని యూపీఏ ప్రభుత్వం హయాంలో ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన నిధుల విధానాన్ని మార్చి, రాష్ట్రాలపై భారాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటోందని ఆయన విమర్శించారు. అలాగే మహాత్మా గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పనులను తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, పథకాన్ని కాపాడుకునేందుకు అందరూ ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ మంద చెంద్రసాగర్, ప్రభాకర్ చారి, మైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-24 at 19.27.48

About The Author