బీడీ కార్మికులకు అండగా సంజీవని శక్తి
కిట్ల పంపిణీ చేసిన కత్తి కార్తిక గౌడ్
సిద్దిపేట:
ప్రతి బీడీ వెనుక ఒక తల్లి కథ… ఆమె ఆరోగ్యం మన బాధ్యత" అనే నినాదంతో టీమ్ కార్తీక పౌండేషన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు సంజీవని శక్తి కిట్లు పంపిణీ చేశారు. దుబ్బాక మండలం శిలాజి నగర్ తాండ గ్రామంలో బీడీ ఖర్కానాను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ మహిళా బీడీ కార్మికులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోజంతా బీడీలు చుడుతూ కుటుంబ భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న అక్కచెల్లెళ్ల ఆరోగ్యం నెమ్మదిగా దెబ్బతింటోందని, అందుకే వారి ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవని శక్తి కిట్లు అందజేస్తున్నామని తెలిపారు. "ఈ సంజీవని కిట్ మీ ఊపిరిలో బలాన్ని, మీ గుండెల్లో ధైర్యాన్ని నింపుతుంది. మీకు తోడుగా మీ బిడ్డగా నేను మీతో ఉన్నాను" అని కార్తిక గౌడ్ హామీ ఇచ్చారు. కార్మికులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దేవేందర్, సర్పంచ్ బానోతు సునీత సంతోష్, ఉప సర్పంచ్ భవిష బాబు, మహేందర్ గౌడ్, పరశురామ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు..jpeg)
