విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

  • - పద్మనాభునిపల్లిలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా వార్షికోత్సవం
  • - హాజరైన జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి (DEO), ఎంఈఓ జోగు ప్రభుదాస్

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

సిద్దిపేట:

విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ చరిత్రలో 
ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ అధ్యక్షతన ఘనంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలకు జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి (DEO), ఎంఈఓ జోగు ప్రభుదాస్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పద్మనాభునిపల్లిలో గతంలో సేవలందించిన పూర్వ ఉపాధ్యాయులు హాజరుకాగ అలాగే గ్రామ సర్పంచ్ వేముల అరుణ రాజేశం,తిమ్మాపూర్ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్, గ్రామ పాలకవర్గం, మాజీ సర్పంచులు కండ్లకొయ్య పర్శరాములు, ముక్కపల్లి శ్రీనివాస్,
 ఉప సర్పంచ్ రుద్రారం యాదగిరి, యువజన సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా విద్యార్థులు ఆట పాటలు అందరిని తెగ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా 
జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి (DEO), ఎంఈఓ జోగు ప్రభుదాస్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు.విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడానికి హెచ్ ఎం మల్లికార్జున్ చేస్తున్న సేవలకు గ్రామస్తుల సహకారం అందించడాన్ని తాము అభినందిస్తున్నమన్నారు. భవిష్యత్ లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని వారికీ ఇక్కడి యువత, పూర్వ విద్యార్థుల సహాకారంతో పాటు గ్రామస్తులు సహకారం అందించాలని కోరారు.
తదనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ మాట్లాడుతూ, “ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం తమ లక్ష్యమన్నారు.ఎందుకు గ్రామ ప్రజలు, యువజన సంఘాల సహకారం ఎంతో అవసరం” అని పేర్కొన్నారు.కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, తదితరులు ఉన్నారు.

About The Author