మామిడి ఎగుమతులతోనే రైతులకు అధిక లాభాలు
శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీలో ‘ఎగుమతి ఉత్పాదకత’పై అతిథి ఉపన్యాసం
గజ్వేల్:
అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మామిడి సాగు చేపట్టినప్పుడే రైతులకు ఆశించిన లాభాలు అందుతాయని నిపుణులు పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో “ఎగుమతి దృష్టితో మామిడి ఉత్పత్తి” అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. నాణ్యతే అంతర్జాతీయ మార్కెట్ సూత్రం ఈ కార్యక్రమానికి APEDA (అగ్రి కల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ) ప్రతినిధులు ఏజీఎం శ్రీ ఆర్. పి. నాయుడు, బీడీఎం శ్రీ బాషా ముఖ్య వక్తలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గ్లోబల్ గ్యాప్ ప్రమాణాలను రైతులు పాటించాలి. పంటలో పురుగుమందుల అవశేషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎగుమతులకు కీలకం. సరైన గ్రేడింగ్, ఆధునిక ప్యాకింగ్, మరియు కోల్డ్ చైన్ నిర్వహణపై రైతులకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎగుమతికి అవసరమైన ధృవపత్రాలు, మార్కెట్ అవకాశాలు, ప్రభుత్వ రాయితీలను వారు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీన్ డాక్టర్ జె. చీనా నాయక్ మాట్లాడుతూ రైతులు సంప్రదాయ పద్ధతులను వీడి, వ్యాపార దృక్పథంతో సాగు చేయాలని సూచించారు. కార్యక్రమ అధ్యక్షత వహించిన డా. డి. విజయ మాట్లాడుతూ సాంకేతిక జ్ఞానంతోనే అధిక ఆదాయం సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని డా. వి. సుచిత్ర సమన్వయం చేయగా.. అధ్యాపకులు డా. జి. సతీష్, బి. చంద్రశేఖర్, సింధుజ, పరిపాలనా అధికారి తులాసిరానితో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
.jpeg)
