వాలీబాల్ విజేతలకు బహుమతులు ప్రధానం
- యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి
- సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ
దుబ్బాక:
యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ అన్నారు.సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో వాలీబాల్ క్రీడా పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ పోటీలను గ్రామ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మార్కుక్, తొగుట, ధర్మాజీపేట్, మిరుదొడ్డి, మర్రిఆండ, వెంకటపూర్, ఐనాపూర్, మర్పడగా, గుడికందుల, పద్మనాభునిపల్లి, తిమ్మాపూర్ గ్రామాల యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ట్రాస్ వేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడా ప్రాంగణంలో సర్పంచ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు కూడా క్రీడల్లో పాల్గొని సందడి చేశారు. పోటీల్లో తుజాల్పూర్ జట్టు మొదటి స్థానాన్ని, తిమ్మాపూర్ యూత్ జట్టు రెండో స్థానాన్ని దక్కించుకున్నాయి. మొదటి బహుమతి విజేతలకు రూ. 10000, రెండో బహుమతి విజేతలకు రూ. 5000 ట్రోఫీలు అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామీణ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తాయని అన్నారు.
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. గ్రామాల్లో క్రీడలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు తాము కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
"చింతల చరణ్ " కి సన్మానం
