వరికుంట్ల KGBV పాఠశాలలో GCDO డి. రూత్ ఆకస్మిక తనిఖీ..
పోరుమామిళ్ళ, (భారత శక్తి ప్రతినిధి) ఆగస్టు 12: స్థానిక వరికుంట్ల గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని (KGBV) మంగళవారం గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి (GCDO) డి. రూత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడిన ఆమె, క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు.జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌ఎన్ శారద, ఏఎన్‌ఎం పద్మ, ఆశావర్కర్ విజయలక్ష్మి, పాఠశాల ప్రిన్సిపాల్ పి. మెర్సిరాణి పాల్గొన్నారు. తదుపరి FA1 పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు, సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు అందించారు.
About The Author
29 Apr 2026
