వ్యక్తిగత వాహానాలతో రవాణా
కర్నూలు, ఆగస్టు 7 పేరుకు అవి వ్యక్తిగత (కార్లు) వాహనాలు. కానీ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణికులను చేరవేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా ఇలా ప్రయాణికులను తరలిస్తున్న వాహనాలు ప్రమాదానికి గురైతే ప్రయాణికుల భద్రత గాలిలో దీపమేనంటున్నారు రవాణా శాఖ అధికారులు. వ్యక్తిగత వాహనాలకు పర్మిట్, ఫిట్‌నెస్ అవసరం లేదు. కానీ రవాణా వాహనాలకు ఈ రెండూ తప్పనిసరి. పర్మిట్, ట్యాక్స్‌లు కలిపి రూ.10 వేలు, ఫిట్‌నెస్ ఫీజు రూ.700 చొప్పున రవాణా శాఖకు చెల్లించాలి. ఒక్కో సీటుకు కొంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సీటింగ్ కెపాసిటీని బట్టి ఈ పన్ను మారుతుంది. ఇది ఒక వాహనానికి మూడు నెలలకు దాదాపు రూ.7 వేల వరకు ఉంటుంది. ఇక వ్యక్తిగత వాహనాలకు, రవాణా వాహనాలకు రెండిరటికీ ఇన్సూరెన్స్ ఉండాలి. రవాణా వాహనాలకు తప్పనిసరిగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి. వ్యక్తిగత కార్లలో ప్రయాణికులను చేరవేస్తున్నట్లు రవాణా పోలీసు అధికారులకు ఫిర్యాదులు అందుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయికర్నూలు నగరం బళ్లారి చౌరస్తాను అడ్డాగా చేసుకుని వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణికులను చేరవేస్తున్నారు. రోజుకు సుమారు 70 నుంచి 100 దాకా వ్యక్తిగత వాహనాల్లో కర్నూలు నుంచి హైదరాబాదు వరకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా తిప్పుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ప్రాంతం నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటోంది. వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ట్యాక్సీల ముసుగులో రోడ్డుపైనే ప్రత్యేక స్టాండ్ ఏర్పాటు చేసి వాహనాలు పార్క్ చేస్తుండటంతో రాక పోకలు అంతరాయం కలుగుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాదాయానికి భారీగా నష్టంకర్నూలు నగరం నుంచి హైదరాబాద్ వరకు వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణికులను చేరవేస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఒక్కొక్క వాహనంలో ఐదు నుంచి పది మందిని తీసుకెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులో ఒక్కొక్కరికి చార్జీ రూ.400 అవుతుంది. అయితే ప్రైవేటు వాహనదారులు రూ.350 నుంచి రూ.500 వరకు తీసుకుంటున్నారు. త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో చాలామంది ప్రయాణికులు వీటిపైనే మొగ్గుచూపుతున్నారు.వ్యక్తిగత వాహనాలు ప్రమాదానికి గురైతే అందులోని ప్రయాణికులకు ఇన్సూరెన్స్ రాదు. పర్మిట్, ఫిట్‌నెస్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటేనే ప్రమాద బాధితులకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. వ్యక్తిగత వాహనాలకు ఇవేవీ ఉండవు. ఒకవేళ ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే ఆయా కుటుంబాలు రోడ్డున పడాల్సిందే. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తున్నప్పటికీ రవాణా, పోలీసు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కూతవేటు దూరంలోనే పోలీసు స్టేషన్ ఉన్నప్పటికీ ప్రైవేటు వాహనదారులు యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. ప్రయాణికులను వాహనాల్లో ఎక్కించేందుకు ఇద్దరు వ్యక్తులకు జీతాలు ఇచ్చి ఏర్పాటు చేసుకుని దందా కొనసాగిస్తున్నారు.
కర్నూలు, ఆగస్టు 7
పేరుకు అవి వ్యక్తిగత (కార్లు) వాహనాలు. కానీ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణికులను చేరవేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా ఇలా ప్రయాణికులను తరలిస్తున్న వాహనాలు ప్రమాదానికి గురైతే ప్రయాణికుల భద్రత గాలిలో దీపమేనంటున్నారు రవాణా శాఖ అధికారులు. వ్యక్తిగత వాహనాలకు పర్మిట్, ఫిట్‌నెస్ అవసరం లేదు. కానీ రవాణా వాహనాలకు ఈ రెండూ తప్పనిసరి. పర్మిట్, ట్యాక్స్‌లు కలిపి రూ.10 వేలు, ఫిట్‌నెస్ ఫీజు రూ.700 చొప్పున రవాణా శాఖకు చెల్లించాలి. ఒక్కో సీటుకు కొంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సీటింగ్ కెపాసిటీని బట్టి ఈ పన్ను మారుతుంది. ఇది ఒక వాహనానికి మూడు నెలలకు దాదాపు రూ.7 వేల వరకు ఉంటుంది. ఇక వ్యక్తిగత వాహనాలకు, రవాణా వాహనాలకు రెండిరటికీ ఇన్సూరెన్స్ ఉండాలి. రవాణా వాహనాలకు తప్పనిసరిగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి. వ్యక్తిగత కార్లలో ప్రయాణికులను చేరవేస్తున్నట్లు రవాణా పోలీసు అధికారులకు ఫిర్యాదులు అందుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయికర్నూలు నగరం బళ్లారి చౌరస్తాను అడ్డాగా చేసుకుని వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణికులను చేరవేస్తున్నారు. రోజుకు సుమారు 70 నుంచి 100 దాకా వ్యక్తిగత వాహనాల్లో కర్నూలు నుంచి హైదరాబాదు వరకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా తిప్పుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ప్రాంతం నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటోంది. వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ట్యాక్సీల ముసుగులో రోడ్డుపైనే ప్రత్యేక స్టాండ్ ఏర్పాటు చేసి వాహనాలు పార్క్ చేస్తుండటంతో రాక పోకలు అంతరాయం కలుగుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వాదాయానికి భారీగా నష్టంకర్నూలు నగరం నుంచి హైదరాబాద్ వరకు వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణికులను చేరవేస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఒక్కొక్క వాహనంలో ఐదు నుంచి పది మందిని తీసుకెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులో ఒక్కొక్కరికి చార్జీ రూ.400 అవుతుంది. అయితే ప్రైవేటు వాహనదారులు రూ.350 నుంచి రూ.500 వరకు తీసుకుంటున్నారు. త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో చాలామంది ప్రయాణికులు వీటిపైనే మొగ్గుచూపుతున్నారు.వ్యక్తిగత వాహనాలు ప్రమాదానికి గురైతే అందులోని ప్రయాణికులకు ఇన్సూరెన్స్ రాదు. పర్మిట్, ఫిట్‌నెస్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటేనే ప్రమాద బాధితులకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. వ్యక్తిగత వాహనాలకు ఇవేవీ ఉండవు. ఒకవేళ ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే ఆయా కుటుంబాలు రోడ్డున పడాల్సిందే. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తున్నప్పటికీ రవాణా, పోలీసు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కూతవేటు దూరంలోనే పోలీసు స్టేషన్ ఉన్నప్పటికీ ప్రైవేటు వాహనదారులు యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. ప్రయాణికులను వాహనాల్లో ఎక్కించేందుకు ఇద్దరు వ్యక్తులకు జీతాలు ఇచ్చి ఏర్పాటు చేసుకుని దందా కొనసాగిస్తున్నారు.
