మైనంపల్లి హన్మంతరావుపై అట్రాసిటీ కేసు నమోదు
జవహర్‌నగర్ : యాప్రాల్‌లో పోలింగ్ పూర్తి అయిన అనంతరం బీఆర్‌ఎస్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య జరిగిన గొడవలో బీఆర్‌ఎస్ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు(Mainampally Hanmantrao)పై అట్రాసిటీ కేసు నమోదైన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సీతారామ్, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం యాప్రాల్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ కరమ్‌చందర్‌ను ఎమ్మెల్యే కులం పేరుతో దూషించారని జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరో ఇద్దరిపైన కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో వర్గానికి చెందిన వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.