నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం

జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేలాల, పౌనూరు గ్రామాల్లో గంజాయి మరియు మత్తు పదార్దాలు, మహిళలపై నేరాలు మరియు సైబర్ క్రైమ్” నిర్మూలన కొరకు ప్రజలు అందరూ సహకరించాలని జైపూర్ ఏసీపీ జి నరేందర్ అన్నారు జైపూర్ SI రామకృష్ణ గారి ఆధ్వర్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి IPS[IG]గారి ఆదేశాల మేరకు మంచిర్యాల ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం జైపూర్ ఏసీపీ జి నరేందర్ మరియు శ్రీరాంపూర్ సీఐ బి రాజులు చైల్డ్ లైన్ డైరెక్టర్ ఆంటోనీ, చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ* గార్లతో కలిసి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం జూన్ 26 సందర్భంగా “గంజాయి మరియు మత్తు పదార్దాలు, మహిళలపై నేరాలు మరియు సైబర్ క్రైమ్” పై అవగాహనా సదస్సు కార్యక్రమం నిర్వహి౦చారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జైపూర్ ఏసీపీ జి నరేందర్ గారు మాట్లాడుతూ సమాజంలో ఒక వ్యక్తి చెడు వ్యసనాలకు అలవాటు పడితే తల్లిదండ్రులు, ఉపాద్యాయులు, స్నేహితులు ఎప్పటికప్పుడూ వారిలో వస్తున్న మార్పులను గమనిస్తూ ప్రాథమిక స్థాయిలో గుర్తించినట్లతే వాటి బారి నుంచి వారిని కాపాడ వచ్చన్నారు. ప్రస్తుత రోజుల్లో అన్ని ప్రాంతాల్లో మత్తు పదార్థాల వినియోగం అధికంగా కావడంలో నేడు ఇది సామాజిక సమస్యగా పరిగణించబడుతోంది. ఇలాంటి సామాజిక సమస్యను రూపుమాపడంతో అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావల్సి వుంటుందని ఇందులో భాగంగా ఎవరైన గంజాయి లేదా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం లాంటి చర్యలకు పాల్పడినట్లుగా ఎవరిలోనైనా ఉపాద్యాయులు గమనిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు, సమాచారం అంధించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, కావున గంజాయి రహిత ప్రాంతంగా గుర్తింపబడటంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అన్నారు. సైబర్ క్రైమ్ గురించి మాట్లాడుతూ* దేశంలో సాంకేతిక రంగంలో ఉద్యోగం వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు వ్యాపారులు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దీన్ని ఆసరగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పలు రకాల ఆర్థిక లావాదేవీలపై కన్నేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వాటిని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, 1098 డయల్ 100, 112 లకు సైబర్ నేరాల బాదితులు పిర్యాదు చేయండి. బాదితులు ఏలాంటి భయాందోళన లేకుండా నేరుగా పిర్యాదు చేస్తే సత్వరమే న్యాయం చేస్తాం. ముఖ్యంగా లోన్ యాప్ ల్లో లోన్ ఇస్తామని మరియు తెలియని వ్యక్తుల పోన్ కాల్స్, మెస్సేజ్ ల లింక్స్ ఓపెన్ చేసి ఇబ్బందులకు గురికావద్దు అని తెలిపారు. ఈ సందర్భంగా జైపూర్ పోలీసువారి చేయూతతో వేలాల, పౌనూరు గ్రామాల యువతకు 2 క్రికెట్ కిట్ల ను జైపూర్ ACP జి నరేందర్, శ్రీరాంపూర్ CI బి రాజు, జైపూర్ ఎస్సై రామకృష్ణ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్యా మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వారి మీద కేసులు పెట్టడంతో పాటు సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా జైపూర్ ఏసీపీ జి నరేందర్ గారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్సై రామకృష్ణ, చైల్డ్ లైన్ డైరెక్టర్ ఆంటోనీ, చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ, జైపూర్ పోలీస్ సిబ్బంది మరియు వేలాల గ్రామ సర్పంచ్ ప్యాగ శ్యామల-లక్ష్మణ్, ఉపసర్పంచ్ నగేష్, పౌనూర్ సర్పంచ్ సారయ్య, వేలాల, పౌనూర్ గ్రామ యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం

జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేలాల, పౌనూరు గ్రామాల్లో గంజాయి మరియు మత్తు పదార్దాలు, మహిళలపై నేరాలు మరియు సైబర్ క్రైమ్” నిర్మూలన కొరకు ప్రజలు అందరూ సహకరించాలని జైపూర్ ఏసీపీ జి నరేందర్ అన్నారు

జైపూర్ SI రామకృష్ణ గారి ఆధ్వర్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి IPS[IG]గారి ఆదేశాల మేరకు మంచిర్యాల ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం జైపూర్ ఏసీపీ జి నరేందర్ మరియు శ్రీరాంపూర్ సీఐ బి రాజులు చైల్డ్ లైన్ డైరెక్టర్ ఆంటోనీ, చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ* గార్లతో కలిసి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం జూన్ 26 సందర్భంగా “గంజాయి మరియు మత్తు పదార్దాలు, మహిళలపై నేరాలు మరియు సైబర్ క్రైమ్” పై అవగాహనా సదస్సు కార్యక్రమం నిర్వహి౦చారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జైపూర్ ఏసీపీ జి నరేందర్ గారు మాట్లాడుతూ

సమాజంలో ఒక వ్యక్తి చెడు వ్యసనాలకు అలవాటు పడితే తల్లిదండ్రులు, ఉపాద్యాయులు, స్నేహితులు ఎప్పటికప్పుడూ వారిలో వస్తున్న మార్పులను గమనిస్తూ ప్రాథమిక స్థాయిలో గుర్తించినట్లతే వాటి బారి నుంచి వారిని కాపాడ వచ్చన్నారు.
ప్రస్తుత రోజుల్లో అన్ని ప్రాంతాల్లో మత్తు పదార్థాల వినియోగం అధికంగా కావడంలో నేడు ఇది సామాజిక సమస్యగా పరిగణించబడుతోంది. ఇలాంటి సామాజిక సమస్యను రూపుమాపడంతో అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావల్సి వుంటుందని ఇందులో భాగంగా ఎవరైన గంజాయి లేదా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం లాంటి చర్యలకు పాల్పడినట్లుగా ఎవరిలోనైనా ఉపాద్యాయులు గమనిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు, సమాచారం అంధించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, కావున గంజాయి రహిత ప్రాంతంగా గుర్తింపబడటంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అన్నారు.

సైబర్ క్రైమ్ గురించి మాట్లాడుతూ* దేశంలో సాంకేతిక రంగంలో ఉద్యోగం వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు వ్యాపారులు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దీన్ని ఆసరగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పలు రకాల ఆర్థిక లావాదేవీలపై కన్నేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వాటిని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, 1098 డయల్ 100, 112 లకు సైబర్ నేరాల బాదితులు పిర్యాదు చేయండి. బాదితులు ఏలాంటి భయాందోళన లేకుండా నేరుగా పిర్యాదు చేస్తే సత్వరమే న్యాయం చేస్తాం. ముఖ్యంగా లోన్ యాప్ ల్లో లోన్ ఇస్తామని మరియు తెలియని వ్యక్తుల పోన్ కాల్స్, మెస్సేజ్ ల లింక్స్ ఓపెన్ చేసి ఇబ్బందులకు గురికావద్దు అని తెలిపారు.

ఈ సందర్భంగా జైపూర్ పోలీసువారి చేయూతతో వేలాల, పౌనూరు గ్రామాల యువతకు 2 క్రికెట్ కిట్ల ను జైపూర్ ACP జి నరేందర్, శ్రీరాంపూర్ CI బి రాజు, జైపూర్ ఎస్సై రామకృష్ణ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది
యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్యా మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వారి మీద కేసులు పెట్టడంతో పాటు సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా జైపూర్ ఏసీపీ జి నరేందర్ గారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్సై రామకృష్ణ, చైల్డ్ లైన్ డైరెక్టర్ ఆంటోనీ, చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ, జైపూర్ పోలీస్ సిబ్బంది మరియు వేలాల గ్రామ సర్పంచ్ ప్యాగ శ్యామల-లక్ష్మణ్, ఉపసర్పంచ్ నగేష్, పౌనూర్ సర్పంచ్ సారయ్య, వేలాల, పౌనూర్ గ్రామ యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

About The Author

Related Posts