తాజా వార్తలు
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... అనుమతి లేని నవోదయ కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి
Published On
By Bharatha Sakthi Desk
భారత శక్తి ప్రతినిధి, కడప, జూలై 17:ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుపుతున్న నవోదయ కోచింగ్ సెంటర్ల పై చర్యలు తీసుకోవాలని గురువారం కడప ఎస్.ఎఫ్.ఐ కార్యాలయం లో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కడప జిల్లా వ్యాప్తంగా చదువు పేరుతో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా... అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు: మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు
Published On
By Bharatha Sakthi Desk
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి), జూన్ 25: అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంత్రివర్యులు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 4వ డివిజన్ రాజీవ్ నగర్ గుట్ట ప్రాంతంలో టి.యు.ఎఫ్. ఐ.డి.సి. నిధులు 50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ 4వ డివిజన్ రాజీవ్ నగర్ గుట్ట ప్రాంతంలో అవసరమైన విద్యుత్ లైన్లు వేసేందుకు నిధులు చెల్లించామని, స్థానిక అధికారులు దగ్గరుండి సరిగ్గా పని చేయించుకోవాలని అన్నారు. నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 6వ డివిజన్ లో ప్రజలందరి భాగస్వామ్యంతో ప్రత్యేక పారిశుద్ద్య కార్యక్రమం చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పనులు వానలు రాకముందే పూర్తి చేయాలని, డ్రైయిన్ నిర్మాణ పనులు ప్రాధాన్యతగా చేపట్టాలని అన్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ అన్ని డివిజన్ లలో అమలు చేయాలని, వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పేదలు నివసించే ప్రాంతాల్లో అధిక శ్రద్దతో ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయాలని అన్నారు. నగరంలో పెండింగ్ అంతర్గత రోడ్డు, డ్రైయిన్ నిర్మాణ పనులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, వర్షాకాలం ముగిసిన తర్వాత వాటిని మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచుకోవడం, పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనం పెంచడం బాధ్యతగా చేయాలని, ఖాళీ స్థలంలో నీరు నిల్వ ఉండకుండా, చెత్త పేరుకొని పోకుండా చూడాలని, ప్రైవేట్ ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్, గ్రౌండ్ లెవెలింగ్ వంటి పనులు చేపట్టాలని భూ యజమానులకు నోటీసులు జారీ చేయాలని అన్నారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ డివిజన్ లో అంతర్గత రోడ్లు, డ్రైయిన్ నాణ్యతతో నిర్మించుకోవాలని అన్నారు. మన ఇంటి ముందు చెత్త వేయవద్దని, కార్పోరేషన్ అధికారులకు సహకరించాలని అన్నారు. ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ప్రజలు తమ వంతు బాధ్యత నెరవేర్చాలని అన్నారు. నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ 580 మీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు 50 లక్షల రూపాయలతో నేడు శంకుస్థాపన చేశామని అన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు రోడ్డు విస్తరణ పనులు, పేయింటింగ్ పనులు, పారిశుధ్య నిర్వహణ కోసం నూతన వాహనాలను కొనుగోలు చేశామని అన్నారు. నగరంలో ప్రజలకు ప్రాథమిక వసతుల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రా, పబ్లిక్ హెల్త్ ఇఇ వి.రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, ఖమ్మం. ఆర్డీఓ నరసింహా రావు, ఖమ్మం అర్బన్ తహసిల్దార్ సైదులు, కార్పొరేటర్ లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా “సయ్యద్” వారి వివాహ మహోత్సవం
Published On
By Bharatha Sakthi Desk
వేములవాడ, జూన్ 23(భారత శక్తి) : ప్రముఖ వ్యాపారవేత్త, సీనియర్ పాత్రికేయులు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాయక్ పాషా చిన్న కుమార్తె వివాహ మహోత్సవం కరీంనగర్ పట్టణంలోని ఐబి గార్డెన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. కరీంనగర్ పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది కీర్తిశేషులు గులాం రబ్బాని కుమారుడైన అప్రోజ్ యస్దానితో లాయక్ పాషా కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకు ప్రముఖులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి వేములవాడ నియోజకవర్గం ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు, హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకల్లో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికెరపు రాకేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, బింగి మహేష్ లతోపాటు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, జర్నలిస్టులు, వైద్యులు, పోలీసు అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, లాయక్ పాషా బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. శిలాఫలకాలు వేసి కాలయాపన చేసే వ్యక్తిని కాను: ఎమ్మెల్యే నాయిని
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి వరంగల్ బ్యూరో(భారత శక్తి)జూన్23: అభివృద్ధి పనుల పేరిట శిలాఫలకాలు వేసి విస్మరించే వ్యక్తిని కాదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ అలంకార్ జంక్షన్ వద్ద రూ.705.84 లక్షల సీఎంఏ నిధులతో నిర్మించ తలపెట్టిన ఉమ్మడి జిల్లా మున్నూరుకాపు సంఘ భవన నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి భవన నిర్మాణం విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి సాధించడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి,మంత్రులు , ఎమ్మెల్యేలు సమిష్టిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి నిర్ణీత సమయంలో పూర్తి చేయడంలో సఫలమవుతున్నామన్నారు. శిలాఫలకాలు వేసి విస్మరించే తత్వం కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదని ఆయన గత ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని స్పష్టం చేశారు. సకాలంలో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా చేయిస్తాననని ఆయన తెలిపారు. రాజకీయంగా,వ్యక్తిగతంగా తనకున్న మిత్రులలో అధికులు మున్నూరు కాపులే నని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రుల సమిష్టి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్నూరు కాపు ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
Published On
By Bharatha Sakthi Desk
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జూన్ 21: 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం లింగంపేట్ గ్రామంలో నాగన్న గారి మెట్ల బావి దగ్గర యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అందరితో కలిసి యోగ సాధన చేసి యోగ కార్యక్రమానికి వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. యోగా చేయడం వల్ల శారీరక ధృడత్వం కాకుండా మానసిక దృఢత్వం కూడా ఏర్పడుతుందని తెలిపారు. అదేవిధంగా యోగ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు వేసిన కఠినతరమైన యోగాసనాలు తిలకించి అభినందించడం జరిగింది. విద్యార్థినీ, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, రోజువారి అలవాటులో ఈ యోగాను చేర్చుకోవాలని దీనివల్ల ప్రతి ఒక్కరూ శారీరకంగానే కాకుండా మానసిక ద్రుడత్వంతో పాటు రోజంతా ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. అదేవిధంగా యోగా దినోత్సవంను లింగంపేట్ లోని నాగన్న గారి భావి దగ్గర నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని తద్వారా ఇలాంటి హెరిటేజ్ సైట్లు ఎంతో ప్రాముఖ్యత పొందుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ,డిపిఓ,డిఎమ్ఎచ్ఓ,డివైఎస్ఓ, మండల స్థాయి అధికారులు, యోగ రామిరెడ్డి, కెజిబివి లింగంపేట్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. ఓట్లేసి గెలిపిస్తే.. కోట్ల స్థలం కొట్టేస్తారా…? -ఎమ్మెల్యే ప్రణాళిక.. అన్న కొడుకు అమలు…
Published On
By Bharatha Sakthi Desk
రూపాయి రూపాయి కూడా పెట్టి.. పియ్య పిండాకూడు తిని.. నాడు వేలకు కొన్న స్థలం నేడు కోట్లకు విలువ పెరగడంతో నాయకుల కన్ను పడింది. ఉపాధ్యాయ నగర్ మారస సరోవర్ ప్రీమియర్ స్టార్ హోటల్ సమీపంలో వాస్తు ప్రకారం అన్ని రకాలుగా మంచి బిజినెస్ ఏరియాలో ఉన్న 300 అంకణాల స్థలంపై గతంలో అన్న సోదరులు.. నేడు అబ్బా కొడుకుల కన్ను పడి కొట్టేయాలని తెర వెనుక మంతనాలు జరిపి అమాయక దళితులను అడ్డుపెట్టి పెద్ద ప్రణాళిక రూపొందించి అమలు చేసే ప్రయత్నం చేశారు. అంతే ఆవేశంగా బాగా భక్షించే అలవాటు పడ్డ రక్షక బటులకు అధిక మొత్తంలో మామూళ్లు ఇచ్చి వారిచే సమర్థవంతంగా పనిచేయించి తన ఇంట్లో గోప్యంగా నివసిస్తున్న 80 ఏళ్ల వృద్ధ వితంతు మహిళ రుద్రరాజు సంపూర్ణమ్మను దౌర్జన్యంగా బయటకు నెట్టి, సీసీ కెమెరాలు పగలగొట్టి, ఇల్లు ధ్వంసం చేసి, పది లక్షలకు పైగా నష్టం కలిగించి వారిని వీధుల పాలు చేసిన సంఘటన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి మహానగరంలో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో శ్రీవారి పాదాల చెంత జరిగింది. వితంతు వృద్ధ మహిళ సంపూర్ణమ్మ మాటల్లో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..నాయనలారా మీ అవ్వను ఆదుకోండి. నేను 1981లో తిరుపతి అర్బన్ మండలం అక్కారం పల్లి గ్రామ లెక్కదాఖలా సర్వే నంబర్ 11/2బి2 లో 150 అంకణములు, 12.50 సెంట్లు భూమిని కొనుగోలు చేశాను. దాని విలువ దిన దినానికి పెరిగి నేడు కోట్లకు పడగలెత్తింది. నాడు అన్నా సోదరులు.. నేడు అబ్బా కొడుకులు… కొట్టేయాలని విశ్వ ప్రయత్నం చేశారు. నన్ను మానసికంగా హింసించి మనోవేదనకు గురి చేశారు. దేవుని నమ్ముకున్న నాకు ఆ భగవంతుడే కాపాడాడు. రెండేళ్లుగా నేను నా చిన్న కూతురు నీరజ నా అల్లుడు సుకుమార్ రాజు ఆ స్థలంలో కాపురం ఉండగా గత నెల 22న అలిపిరి ఎస్సై లోకేష్ కుమార్ తన అల్లుడు కూతుర్ని స్టేషన్కు రమ్మని, నా కూతురును స్టేషన్లో ఉంచి నా అల్లుడ్ని నేను నివాసం ఉంటున్న స్థలంకి తీసుకు వచ్చి క్షుణ్ణంగా పరిశీలించి నగరమంతా తిప్పి సాయంత్రం గా దొంగతనం కేసు ఉందని రిమాండ్ కు పంపారు. 23న తిమ్మి నాయుడుపాలెం చెందిన తెలుగుదేశం పార్టీ చోటా నాయకుల వెంకటరత్నం, విజయ్ లతోపాటు జవహర్ బాబు, చెన్నయ్య, జాన్ డబ్ల్యు పాలస్తీన్, జూలీ హెలినా, హేమా హెప్సిబా, సికే లీనా వినోలియా,న్యాయవాది బోకం రమేష్, తిమ్మినాయుడు పాలెం కు చెందిన వెంకటరత్నం కొడుకు పుతిన్, లోకేష్, ప్రశాంత్, చిత్తూరుకు చెందిన రౌడీ మూకల కొందరు ఏపీ 39ఎన్జే 3405 కారు, ఏపీ 39 టిఎఫ్ 0700 ఆటోలో వచ్చి దౌర్జన్యంగా నన్ను నా కూతుర్ని నానా దుర్భాషలాడి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, ఇల్లు చెట్లను కూల్చేసి వీధులపాలు చేశారు. పోలీసులు పట్టించుకోక పోగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తనకు కొంతమేర ఉపశమనం కలిగింది. అయినా ఆ దౌర్జన్యకారులు హింసాత్మక, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు. నాకు అన్యాయం చేసిన వారు సర్వ నాశనమైపోతారు. నా శాపనార్ధాలు తప్పక ఫలిస్తాయి. నా స్నేహితురాలు దొమ్మరాజు లక్ష్మమ్మను పొట్టన పెట్టుకున్నారు. ఉన్నతాధికారులు, రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులే తనను కాపాడుతారని నమ్మకంతో విశ్వసిస్తున్నాను. నా మానసిక క్షోభ నన్ను ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పదని భావిస్తున్నాను. మాదకద్రవ్యాలపై అవగాహన కల్పిస్తున్న ఎస్సై సాయన్న..
Published On
By Bharatha Sakthi Desk
రుద్రూర్, జూన్ 19 (భారత శక్తి): రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనకై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ, సదస్సు, ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ..యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంపై పోలీస్ శాఖకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. యోగాతో మనశ్శాంతి, విశ్వ శాంతి
Published On
By Bharatha Sakthi Desk
మీ ఆరోగ్యం బాగుపడాలన్నా, మీకు మనశ్శాంతి కలగాలన్నా, మీరు అందంగా కనిపించాలన్నా, మీకు మంచి శరీరాకృతి కావాలన్నా, తప్పకుండా మీరు రోజు యోగ సాధన చేయాల్సిందేనని డాక్టర్ గాని, మానసిక వైద్యుడు గాని, బ్యూటిషన్ గాని ఖచ్చితంగా ఇచ్చే సలహా ఇదే! ఆధునిక కాలంలో మనిషికి యోగాతో అవినాభావ సంబంధం ఏర్పడిందని తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే.. విద్యా సంస్థల్లో మంచి ఫలితాలు సాధించాలనుకునే విద్యార్థులకు, ఏకాగ్రతతో బాగా ఆడాలనుకునే క్రీడాకారులకు, చక్కటి గాత్ర సౌలభ్యాన్ని పెంచుకోవాలనుకునే గాయకులకు, చురుకుగా శరీరాన్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచుకొని నటించాలనుకునే నటీనటులకు, ఫ్యాక్టరీల్లో చురుకుగా పనిచేయాలనుకునే కార్మికులకు, పంట పొలాల్లో శ్రమించాలనుకునే రైతన్నలకు, ఒకరేమిటి..! అన్ని రంగాల్లోనూ మెరుగైన ఫలితాల కోసం నేడు ఆధునికుల జీవన గమనం లో యోగా సాధన ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఇలా అందరూ యోగా చేయమంటున్నారు. ఇన్ని రకాలుగా నేడు యోగ ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. ఇంతటి ప్రాచుర్యాన్ని పొందిన యోగా అంటే ఏమిటి? యోగా మానవ జీవన గమనంలో ఎటువంటి పాత్రను పోషిస్తుందో తద్వారా విశ్వశాంతికి యోగ ఎలా సాధనం అవుతుందో తెలుసుకుందాం! :: యోగా అంటే…..? యోగా అంటే యూజ్ అంటే కలయిక అని ధాతువు నుండి ఏర్పడినది యతే తదితి యోగః యుజ్యతి అనే ఇతి యోగః అని వ్యుత్పత్తి దీనికి నిర్వచనం జ్ఞాన కర్మేంద్రియాలు వశపరిచి మనసును పరమాత్ముని యందు లగ్నం చేయునది సనాతన భారతీయ ఆధ్యాత్మిక సాధనలో యోగా అత్యున్నత సమాహారాల భాగము మానవుడికి మోక్ష సాధనలో భాగమైన అంత దృష్టిని పరమానంద ప్రాప్తిని కలిగించే ఏకైక ఆధ్యాత్మిక సాధనము యోగ ఇది మానవ జీవన గమనానికి పునాది వంటిది. యోగా అంటే ఆరోగ్యం యోగ అంటే మానసిక చైతన్యం సాధారణ మానవుడిని పరిపూర్ణుడిగా మార్చి పురోగమింపజేసే దివ్య ఔషధం మనసును స్పృశిస్తూ శరీరంతో బ్యాలెన్స్ చేస్తూ వ్యక్తిని కలిగించే మహత్తు కేవలం యోగాకే ఉంది ఆ శక్తిని భారతదేశం ఏనాడో గ్రహించింది కనుకనే ప్రపంచానికి గురు స్థానంలో గౌరవించబడుతుంది వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం యోగ శ్వాసపై ధ్యాస ధ్యానం వంటివి కూడా జత చేసి ప్రాణ శక్తిని ఉత్తేజితం చేయడం యోగాలో ఉన్న ప్రత్యేకత ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి తోడ్పడితే హఠాయోగం దేహదారుధ్యాన్ని ముఖవర్త్యస్థును ఇనుమడింప చేస్తుంది యోగేశ్వరం ప్రణన్యాయం యోగం చేస్తే ఈశ్వరుడికి ప్రణామం చేసినట్టే అన్నది ఉపనిషత్ వాక్యం :: పతంజలి అష్టాంగ యోగం :: సామాన్య శక పూర్వము నూరవ శకము నుండి 500 శకము మధ్యకాలంలో ‘పతంజలి మహర్షి’ నేతృత్వంలో వేద, ఉపనిషత్, పురాణ, రామాయణ, భాగవత, భారత, భగవద్గీతలలోని యోగ ప్రస్తావనల సమాహారం వంటివి “పతంజలి యోగ సూత్రాలు.” ఇలా క్రోడీకరించిన ఆద్యుడు మహర్షి పతంజలి. సూత్రము అంటే దారము. దారానికి మణులను చేర్చినట్లు, యోగ శాస్త్రాన్ని పతంజలి మహర్షి ఒకచోట చేర్చాడు. ఈ మహర్షి యోగ సూత్రాలలో రెండు ప్రధానమైనవి. అవి: 1) హఠయోగ ప్రదీపిక, 2) శివ సంహిత వీటిలోని అంతర్భాగాలు కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాలు హిందూ తత్వంలో ప్రధాన భాగాలు. భగవద్గీతలో యోగాసనాలను 18 భాగాలుగా విభజించి వివరించబడినాయి. అయితే యోగం అంటే సాధనము, అదృష్టము అని అర్థాలు ఉన్నాయి. భగవద్గీతలోని 18 అధ్యాయాలకు యోగములని పేర్లు ఉన్నాయి. “చిత్త వృత్తి నిరోధకః” అనగా స్థిరాసనములో ఉండి, అభ్యాస వైరాగ్యములతో చిత్త వృత్తులను అంటే మనస్సు యొక్క క్రియలను నియంత్రించడం (అదుపు చేయడం) దీన్నే “పతంజలి అష్టాంగ యోగం” అని అంటారు. యోగ అనేది మనిషి మనుగడలో ఒక భాగం. మనిషిని ఒత్తిడి నుంచి దూరం చేసి శరీరానికి విశ్రాంతినిచ్చి మనస్సుకు శాంతినిచ్చి స్థిరం చేసే ఒక ప్రక్రియ. మనిషి ఒత్తిడికి గురైతే వ్యవస్థలు సక్రమంగా పనిచేయక, శరీరం యావత్తు రోగగ్రస్తం అవుతుంది. శరీరం కనక రోగమయమైతే మనసు కల్లోలం అవుతుంది. అప్పుడు ఏ పని మీద మనస్సు లగ్నం చేయలేక, ఏ పనిలోనూ నైపుణ్యం సాధించలేక, మనిషి వెనుకబడిపోతాడు. కొంతమంది అయితే దురలవాట్లకు బానిసలై, తమ జీవితాలను నాశనం చేసుకోవటమే కాకుండా, తమపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవితాలను కూడా నాశనం చేస్తారు. వీటన్నిటికీ ఏకైక విరుగుడు యోగ సాధన మాత్రమే. యోగ భారతీయుల మానస పుత్రిక. భారతీయుల జీవన విధానం. ప్రపంచానికి భా ఇచ్చిన ఒక గొప్ప వరం. ప్రాచీన కాలం నుండి మన దేశంలో యోగ విలసిల్లింది. పతంజలి మహర్షి వంటి మహానుభావులు యోగకు కర్తలుగా ఉండి, తమ యోగ సూత్రాలతో సామాన్యుడిని పరిపూర్ణుడిగా తీర్చిదిద్దిన ఘనత ఆ మహనీయునిది. పతంజలి యోగ శాస్త్రం పై అనేక భాష్యాలు కూడా వెలువడ్డాయి. ::యోగా పట్ల పాశ్చాత్యులలో పెరుగుతున్న ఆసక్తి:: యోగ నిజానికి అష్టాంగ యోగ నుండి వచ్చింది. ఈ అష్టాంగ యోగలో 8 రకాల విభాగాలు, అభ్యాసాలు ఉన్నాయి. వీటిని విభాగాలు అనటం కన్నా స్థాయి,సోపానం, మెట్లు, అనటం బాగుంటుంది. ఒక్కొక్క స్థాయి యోగాసాధకుడిని ఒక్కొక్క మెట్టు పైకి తీసుకెళుతుంది. యోగా సాధకుడు పై స్థాయికి చేరుకున్నప్పుడు సాక్షాత్తు పరమ పదాన్ని చేరుకున్నట్లే అని భావించాలి. ఈ మధ్యకాలంలో అందరూ ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి మూడింటిని మాత్రమే చేస్తూ కేవలం ఇదే యోగ అని భావిస్తున్నారు. ఇవి కేవలం బాహ్య క్రియలు మాత్రమే. వీటికి అంతర్క్రియలైన మిగతావి తోడైతే యోగాసాధకుడు పరిపూర్ణుడు అవుతాడు. ఆధునిక వైద్య శాస్త్రానికి లొంగని ఎన్నో సమస్యలు యోగాకు లొంగుతాయి. శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలు ఉన్నాయి. కనుకనే పాశ్చాత్య ప్రపంచం కూడా యోగా పట్ల ఆసక్తి పెంచుకొన్నది. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 సెప్టెంబర్ 27 న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ.. యోగా విశిష్టతను, విశ్వ శాంతి సాధనలో యోగా ప్రాత్రను తెలియపరచి, అంతర్జాతీయ యోగా దినం జరుపవలసిన ఆవశ్యకతను వివరించారు. మన ప్రధాని సూచనను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఆ ఫలితంగా ప్రపంచ స్థాయిలో ఈరోజును (జూన్ 21) “అంతర్జాతీయ యోగా దినోత్సవం” గా ప్రకటించింది. ఈ ప్రకటనను 170 సభ్య దేశాలు తమ ఆమోదాన్ని ప్రకటించాయి. ఇది భారత్ కు ఎంతో గర్వకారణం. దీనిని బట్టి విశ్వంలో భారతీయ యోగాకు ఎంతటి ప్రాధాన్యం ఉన్నదో తెలుస్తుంది. భారత దేశంలో పుట్టిన యోగా పట్ల యావత్ ప్రపంచం రోజు రోజుకీ ఎంతో ఆసక్తిని పెంచుకుంటుంది. ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా సుమారు 180 పైగా దేశాల్లో యోగా మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం విశ్వవ్యాప్తంగా 50 కోట్లకు పైగా యోగ సాధన నిత్యం కొనసాగిస్తున్నారని, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అడపాదడపా యోగా చేసేవారైతే సుమారు 100 కోట్లకు పైగా ఉంటారని నిపుణుల అంచనా! :: యోగ సాధనలో ముందు? వెనక? యోగ సాధనలో ఆసన, ప్రాణాయామ, క్రియలు, ముద్రలు వంటి రకరకాల ప్రక్రియలు ఉంటాయి. యోగా సాధకునికి వీటిలో ఏవి ముందు చేయాలి? ఏవి వెనక(తర్వాత) చేయాలి? అనే సందేహాలు కలుగుతుంటాయి. యోగా సాధనకు ముందు సాధారణ శ్వాస తీసుకోవాలి. తరువాత 5 నుండి 11 సార్లు “ఓం”కారం ఉచ్ఛరిస్తూ సాధన చేయాలి. తరువాత సూక్ష్మ వ్యాయామం అంటే శరీరాన్ని చల్లబరిచే కొన్ని వ్యాయామాలు చేయాలి. ఆ తరువాత సూర్య నమస్కారాలు. తదుపరి శవాసనం. ఆ తర్వాత కొన్ని ఆసనాలు. ఆ తరువాత శవాసనం. పిమట ప్రాణాయామం చివరన ధ్యానంతో సాధన ముగించాలి. అయితే మధ్య మధ్యలో చేసే శవాసనం అలసటను బట్టి ఐదు నుండి పది నిమిషాల వరకు వేయవచ్చు. శవాసనమంటే.. శరీరంలోని అన్ని భాగాలను వదులు చేసి ఉచ్వాస నిచ్వాసాలను సమస్థాయిలో ఉంచి విశ్రాంతి తీసుకోవడమే శవాసనం. ఎలాంటి శారీరక రుగ్మతలు లేనివారు అన్ని రకాల వ్యాయామాలు ప్రక్రియలు సాధన చేయవచ్చు. ఏమైనా వ్యాధులు ఉన్నప్పుడు కొన్ని హద్దులు మాత్రం పాటించవలసి ఉంటుంది. ఈ హద్దులు ఏమిటో యోగాచార్యుల వద్ద తెలుసుకొని పాటించడం వలన త్వరగా వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవచ్చు. యోగా సాధనలో కేవలం ఆసనాలు, ప్రాణాయామం వలననే పూర్తి ఫలితాలు రావు. సంపూర్ణ ఫలితం రావాలంటే యమ, నియమాలు పాటిస్తూ.. ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి పాటించాల్సి ఉంటుంది. క్రియలు, విశ్రాంతి ప్రక్రియలు చేయడం, సరైన జ్ఞాన ఉపన్యాసాలు వినడం ద్వారా, ఆహార నియమాలను పాటించడం ద్వారా సంతోషంగా, ఆనందంగా ఉండటం, తృప్తిగా జీవించటం వంటివి, జీవనశైలిలో భాగం చేసుకోవడం వలన మాత్రమే సంపూర్ణ ఆరోగ్యం ఆనందం యోగాసాధకుడు పొందగలుగుతాడు. :: సమాజంపై యోగా సాధకుల ప్రభావం:: నిత్యం యోగా సాధన చేస్తున్న సాధకుడు శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాడు. ఈ ప్రభావం వల్ల అతని కుటుంబంలో శాంతి సామరస్యం, మంచి సంబంధాలు, సర్దుకుపోయే అలవాటు, సహాయ, సహకారాలు, కలిసి పనులు చేసుకోవడం, పెద్దలకు సేవ చేయటం, పెద్దలను గౌరవించడం, కుటుంబంలో బాధ్యతను గుర్తించి నెరవేర్చటం, ఇవన్నీ సహజంగా జరుగుతాయి. యోగా సాధన చేస్తున్న కుటుంబాలు సమాజంలో గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి అనవచ్చు. ఆ కుటుంబంలోని మంచి గుణాలు గమనించిన వారు యోగా గొప్పదనం తెలుసుకొని, వారు కూడ సాధన చేయడం మొదలు పెడతారు. సమాజంలో ఆదర్శంగా ఉండటం, సామాజిక కార్యక్రమాలలో ముందుండి సేవ చేయడం, సత్సంబంధాలు కలిగి ఉండటం, సమాజం అభివృద్ధిని, శాంతిని, ఆరోగ్యాన్ని కోరుకోవడం వల్ల, మంచి ఆదర్శవంతమైన, ఆరోగ్యప్రదమైన సమాజాలు తయారవుతాయి. ఇటువంటి సమాజాలు పెద్ద ఎత్తున పెరగటం వల్ల రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం, సమస్త విశ్వంలో శాంతి, సామరస్యం, ఆరోగ్యం, ఆనందం వెల్లివిరిస్తాయి అనడంలో ఏమాత్రము సందేహించవలసిన అవసరం లేదు. ఇంతటి మహత్తరమైన, భారతీయుల ‘మానస పుత్రిక’ అయిన యోగ ప్రక్రియకు మరింత వైభవాన్ని తేవాలంటే, దీనిని అందరూ నిత్యం విధిగా సాధన చేయాలి. నిత్య యోగా సాధన వలన ఇటు వ్యక్తిగతంగా మనశ్శాంతి, బాన్సువాడ తిరుమలాపూర్ గ్రామంలో అప్గ్రేడషన్ అంగన్వాడి సెంటర్ ను సందర్శించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
Published On
By Bharatha Sakthi Desk
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జూన్19: బాన్సువాడ ప్రాజెక్టులోని తిరుమలాపూర్ గ్రామంలో అప్గ్రేడషన్ అంగన్వాడి సెంటర్ ను కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి పాఠశాలలో చిన్న పిల్లలు కలెక్టర్, సబ్ కలెక్టర్ కు పూలతో స్వాగతం పలికారు.అనంతరం అంగన్వాడి సెంటర్ ను వారు సందర్శించి పిల్లలతో పాటలు పాడించి, బొమ్మలను చూపిస్తూ వాటి పేర్లు చెప్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సెంటర్ లోని వంటశాలను సందర్శించి ఫుడ్ మెనూ అడిగి తెలుసుకొని కొత్తగా వచ్చిన పిల్లలకు కలెక్టర్, సబ్ కలెక్టర్ ల చేతుల మీదుగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత అంగన్వాడి ప్రాంగణంలో మొక్కలు నాటారు. అంగన్వాడీ ప్రాంగణంలో గల గ్రౌండ్, ఆట వస్తువుల గురించి మాట్లాడి వాటిని నిర్మించడానికి కావలసిన చర్యలను తీసుకోవాలని, మెనూ ప్రకారం చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని, పూర్వ ప్రాథమిక విద్యలో మంచి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రేమల, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, సీడీపీఓ, సూపవైజర్, మండల అధికారులు తహసీల్దార్, ఎంఈఓ, ఎంపీడీవో, గ్రామ సెక్రటరీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Published On
By Bharatha Sakthi Desk
జిన్నారం, జూన్ 18 (భారత శక్తి): కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని.. ఇందుకు అనుగుణంగా ప్రతి పాఠశాలలో మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిన్నారం మండలం వావిలాల గ్రామంలో 40 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత దశాబ్ది కాలంలో ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు వచ్చాయని తెలిపారు. కేజీ నుండి పీజీ వరకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే. అన్ని రకాల వసతులతో విద్యను ఉచితంగా ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. విద్యతోపాటు క్రీడారంగంలో రాణించే క్రీడాకారులకు సైతం సంపూర్ణ సహకారం అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు. విద్యతో ప్రపంచాన్ని జయించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి పరిశ్రమల సహకారం అభినందనీయం :ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Published On
By Bharatha Sakthi Desk
గుమ్మడిదల, జూన్ 18 (భారత శక్తి): గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు పరిశ్రమల యాజమాన్యాలు తమ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మౌలిక వసతులు.. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం అభినందనీయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కేంద్రమైన గుమ్మడిదలలో హానర్ లాబ్స్ సౌజన్యంతో 15.50 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డు, యుజిడీలను ప్రారంభించారు. అనంతరం గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం గ్రామంలో మోల్డ్ టెక్ పరిశ్రమ సౌజన్యంతో ఒక కోటి 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని ఎమ్మెల్సీ అంజిరెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైనప్పుడే ప్రతి కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందని అన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా.. నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల భవనాలను ఆధునిక వసతులతో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పురాతన భవనాల స్థానంలో ప్రభుత్వం అందించే నిధులతో పాటు సిఎస్సార్ నిధులతో నూతన భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేపడుతున్న సంస్కరణల మూలంగా.. అడ్మిషన్లు సైతం దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలతో పాటు రాష్ట్ర జాతీయ పరీక్షల్లోనూ ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికబద్ధంగా మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మర్యాదపూర్వకంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ని కలిసిన నూతన జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
Published On
By Bharatha Sakthi Desk
సంగారెడ్డి, జూన్ 18 (భారత శక్తి): రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పి. ప్రావీణ్య, మర్యాదపూర్వకంగా మంత్రి ని బుధవారం సంగారెడ్డి నివాసంలో కలిశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సంగారెడ్డి జిల్లాలో ముందుకు తీసుకెళ్లాలా ప్రణాళికలను రూపొందించాలని మంత్రి, జిల్లా కలెక్టర్ కు సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రైతు నేస్తం, భూభారతి చట్టం అమలు, విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారత, శిశు సంక్షేమ పథకాల అమలు కు కృషి చేయాలని మంత్రి,కలెక్టర్ కు సూచించారు. సామాన్యులకు ప్రభుత్వ పథకాలు చేరువ అయ్యేలా కృషి చేయాలని మంత్రి సూచించారు. 