దేశ సేవకు పునరంకితం కావాలి: అడ్మిన్ డీసీపీ శ్రీమతి ఇందిర
సైబరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా సైబరాబాద్ అడ్మిన్ డీసీపీ శ్రీమతి ఇందిర గారు స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ జాతీయ జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సిబ్బంది, ప్రజలందరికీ ముందుగా 75వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ దేశసేవకు పునరంకితం కావాలన్నారు. స్వాతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకోవడం, భారతదేశానికి స్వేచ్ఛ కల్పించిన త్యాగధనులను స్మరించుకోడం మనందరి బాధ్యత అన్నారు. పోలీసు అధికారులు జాతి సమగ్రత, సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేయాలన్నారు. ఎందరో మహానుభావులు త్యాగఫలమే ఈరోజు మనందరం స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. మహానుభావుల త్యాగాలను నిరంతరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ అడ్మిన్ డీసీపీ శ్రీమతి ఇందిర, డీసీపీ క్రైమ్స్ శ్రీమతి కవిత, ఏడీసీపీ శ్రీ రియాజ్, ఏడీసీపీ శ్రీ వెంకట్ రెడ్డి, ఏసీపీలు, సెక్షన్ల సిబ్బంది, ఇన్ స్పెక్టర్లు, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు.
సైబరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా సైబరాబాద్ అడ్మిన్ డీసీపీ శ్రీమతి ఇందిర గారు స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ జాతీయ జెండావిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సిబ్బంది, ప్రజలందరికీ ముందుగా 75వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ దేశసేవకు పునరంకితం కావాలన్నారు. స్వాతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకోవడం, భారతదేశానికి స్వేచ్ఛ కల్పించిన త్యాగధనులను స్మరించుకోడం మనందరి బాధ్యత అన్నారు. పోలీసు అధికారులు జాతి సమగ్రత, సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేయాలన్నారు. ఎందరో మహానుభావులు త్యాగఫలమే ఈరోజు మనందరం స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. మహానుభావుల త్యాగాలను నిరంతరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ అడ్మిన్ డీసీపీ శ్రీమతి ఇందిర, డీసీపీ క్రైమ్స్ శ్రీమతి కవిత, ఏడీసీపీ శ్రీ రియాజ్, ఏడీసీపీ శ్రీ వెంకట్ రెడ్డి, ఏసీపీలు, సెక్షన్ల సిబ్బంది, ఇన్ స్పెక్టర్లు, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు.
