ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఖమ్మం బ్యూరో, భారత శక్తి, జనవరి 30: మహాత్మగాంధీ వర్ధంతి సందర్భంగా ఖమ్మం ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ఆవరణలో వాసవి క్లబ్ రోటరీ నగర్ ఖమ్మం అధ్యక్షులు పాలువాయి వెంకటేశ్వరరావు గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పాల్వాయి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గాంధీ మహాత్ముడి జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. సత్యం, అహింస, శాంతి వంటి వాటి గురించి బాపూజీ చెప్పడమే కాదు ముందుగా తనే ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. బాపూజీ తన జీవితంతో పాటు మన జీవితానికి సంబంధించి కొన్ని మంచి విషయాలతో పాటు సేవాగుణాన్ని అలవరచుకుని సత్యమార్గం దిశగా పయనించేందుకు దిశా నిర్దేశం చేస్తూ ఎన్నో సూక్తులు సందేశాలను చెప్పారు. కేవలం బోధనలతోనే కాకుండా ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్, విదేశీ వస్తువుల బహిష్కరణ, సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఇలా మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి కేవలం శాంతియుతంగా పోరాడారు. తనతో పాటు ఇతర నాయకులను కలుపుకుని అందరి సహాయంతో తెల్లదొరలను వారి దేశాలకు తరమి కొట్టడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన శాంతియుత, ప్రేరణాత్మకమై, స్ఫూర్తినిచ్చే సందేశాలను, సూక్తులను ఓసారి అందరం స్మరించుకోవలసిన అవసరం ఉన్నది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ రోటరీ నగర్ ప్రధాన కార్యదర్శి కాజా వెంకటేశ్వరరావు, కోశాధికారి తల్లాడ వినోద్ కుమార్ , జోన్ చైర్ పర్సన్ కొదుమూరి జగన్నాథం, యమసాని శ్రీనివాసరావు, కొదుమూరు శ్రీనివాసరావు, అందవరపు మల్లేష్, కాబినెట్ వైస్ గవర్నర్ మాశెట్టి వరప్రసాద్, రంగా పురుషోత్తం, నిత్య గోమాత సేవకులు సీనియర్ జర్నలిస్ట్ రాయల బసవేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం బ్యూరో, భారత శక్తి, జనవరి 30: మహాత్మగాంధీ వర్ధంతి సందర్భంగా ఖమ్మం ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ఆవరణలో వాసవి క్లబ్ రోటరీ నగర్ ఖమ్మం అధ్యక్షులు పాలువాయి వెంకటేశ్వరరావు గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పాల్వాయి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గాంధీ మహాత్ముడి జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. సత్యం, అహింస, శాంతి వంటి వాటి గురించి బాపూజీ చెప్పడమే కాదు ముందుగా తనే ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. బాపూజీ తన జీవితంతో పాటు మన జీవితానికి సంబంధించి కొన్ని మంచి విషయాలతో పాటు సేవాగుణాన్ని అలవరచుకుని సత్యమార్గం దిశగా పయనించేందుకు దిశా నిర్దేశం చేస్తూ ఎన్నో సూక్తులు సందేశాలను చెప్పారు. కేవలం బోధనలతోనే కాకుండా ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్, విదేశీ వస్తువుల బహిష్కరణ, సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఇలా మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి కేవలం శాంతియుతంగా పోరాడారు. తనతో పాటు ఇతర నాయకులను కలుపుకుని అందరి సహాయంతో తెల్లదొరలను వారి దేశాలకు తరమి కొట్టడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన శాంతియుత, ప్రేరణాత్మకమై, స్ఫూర్తినిచ్చే సందేశాలను, సూక్తులను ఓసారి అందరం స్మరించుకోవలసిన అవసరం ఉన్నది అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ రోటరీ నగర్ ప్రధాన కార్యదర్శి కాజా వెంకటేశ్వరరావు, కోశాధికారి తల్లాడ వినోద్ కుమార్ , జోన్ చైర్ పర్సన్ కొదుమూరి జగన్నాథం, యమసాని శ్రీనివాసరావు, కొదుమూరు శ్రీనివాసరావు, అందవరపు మల్లేష్, కాబినెట్ వైస్ గవర్నర్
మాశెట్టి వరప్రసాద్, రంగా పురుషోత్తం, నిత్య గోమాత సేవకులు సీనియర్ జర్నలిస్ట్ రాయల బసవేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
