కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందా..? బీ.ఆర్.ఎస్. ఉనికిని చాటుకుంటుందా..? బీజేపీ బలపడిందా..?

- మూడు పార్టీల భవితవ్యాన్ని తేల్చనున్న సర్పంచ్ ఎన్నికలు.. 
- తమకే అనుకూలం అంటున్న కాంగ్రెస్, బీ.ఆర్.ఎస్., బీజేపీలు.. 
- బీసీ రిజర్వేషన్స్ అంశం ప్రభావం చూపే అవకాశం.. 
- పార్టీల బలాబలాలపై వివిధ వ్యాఖ్యలు చేస్తున్న రాజకీయ విశ్లేషకులు.. 
- స్పెషల్ ఆఫీసర్స్ పాలనకు ఇక ముగింపు కలుగనుంది.. 
- ఆచి తూచి జాగ్రత్తగా అడుగులు వేస్తున్న ఎలక్షన్ కమిషన్.. 
- జిల్లా కలెక్టర్లర్లను అలెర్ట్ చేసిన అధికార కాంగ్రెస్ ప్రభుత్వం.. 
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో జోష్ మీదున్న రేవంత్ సర్కార్.. 
- ఉనికిని చాటుకుంటామంటున్న భారత రాష్ట్ర సమితి.. 
- ఈసారి సత్తా చాటుతామని చెబుతున్న భారతీయ జనతా పార్టీ.. 
- స్థానికంగా ఎన్నెన్నో ప్రభావాలు వుంటాయంటున్న విశ్లేషకులు.. 
- పంచాయతీ ఎన్నికల సరళి, పార్టీల బలా బలాలు, బీసీ రిజర్వేషన్స్ ప్రభావంపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న ప్రత్యేక కథనం.. 

download (1)

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )

Read More అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం

పల్లెలు, పంచాయితీలు దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్మాగాంధీ చెప్పిన మాటలు అక్షర సత్యాలు.. ఎప్పుడైనా గ్రామాలు పటిష్టంగా ఉంటేనే దేశం కూడా పఠిష్టంగా ఉంటుంది.. అదేవిధంగా గ్రామీణ రాజకీయాలు రాష్ట్ర, దేశ రాజకీయాలను శాసిస్తాయి.. అందుకే గ్రామీణ స్థాయి ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.. అయితే పల్లెలను తీర్చిదిద్దాల్సిన రాజకీయ నాయకులు పట్టించుకోవడం మానేశారు.. పంచాయితీ స్థాయి ఎన్నికలను సైతం నిర్వీర్యం చేస్తున్నారు.. గ్రామ సర్పంచ్ లను  బానిసలకంటే హీనంగా  చూడటం మొదలుపెట్టారు.. పంచాయితీలకు చెలించాల్సిన బకాయిలను కూడా చెల్లించడం మానేశారు.. దీంతో ఎంతోమంది సర్పంచ్ లు  అప్పులపాలై ప్రాణాలు తీసుకున్న సందర్భాలు ఎన్నెన్నో చూసాం.. పంచాయితీ స్థాయిలో పటిష్టం చేయగలిగితే ఎంతో మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు ఎప్పుడూ సూచిస్తూనే వుంటారు.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల నగారా మ్రోగింది.. ఈ ఎన్నికలు  అధికార పార్టీతో బాటు, ఇటు బీ.ఆర్.ఎస్. అటు బీ.జె.పీ. పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి.. ఎలాగైనా క్షేత్ర స్థాయిలో పట్టు సాధించి పరువు నిలుపుకోవాలని చూస్తున్నాయి.. 

Read More కాంగ్రెస్ లో చేరిన ఉటూరు బీఆర్ఎస్ నేతలు

  
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన గ్రామ పంచాయతీ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత వస్తున్న ఈ ఎన్నికలు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ పంచాయతీ ఎన్నికల సరళి, పార్టీల బలాబలాలు, బీసీ రిజర్వేషన్ల ప్రభావంపై ఒక విశ్లేషణ.. 

Read More అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

తెలంగాణలో ఐదేళ్ల సర్పంచుల పదవీకాలం ముగియడంతో, ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.ఎన్నికల సరళి: ఎలా ఉండబోతున్నాయి? ఈసారి పంచాయతీ ఎన్నికలు మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. 

Read More కాంగ్రెస్ లో చేరిన బద్దిపల్లి, బహదూర్ఖాన్ పేట స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థులు

ఇవి పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రతి అభ్యర్థి వెనుక ఏదో ఒక ప్రధాన పార్టీ మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఇక స్థానిక అంశాల ప్రాధాన్యత కూడా ఇక్కడ ప్రభావం చూపుతుంది.. రాష్ట్రస్థాయి విధానాల కంటే గ్రామంలోని కుల సమీకరణాలు, అభ్యర్థి వ్యక్తిగత ప్రతిష్ట, స్థానిక సమస్యలే ఎన్నికల ఫలితాలను శాసిస్తాయి.

Read More రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2047 జూమ్ సమావేశం

డబ్బు, మద్యం ప్రభావం : 
గత అనుభవాల దృష్ట్యా, సర్పంచ్ పదవి కోసం అభ్యర్థులు భారీగా ఖర్చు చేసే అవకాశం ఉంది. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం 'వేలం పాటలు' జరిగే సంస్కృతి ఆందోళన కలిగిస్తోంది. 

Read More అయ్యప్ప మహా పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

రాజకీయ పార్టీల బలాబలాల విషయానికి వస్తే.. ఏ పార్టీకి లాభం చేకూరనుంది.. ? ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగా ప్రధాన పార్టీల స్థితిగతులు ఇలా విశ్లేషించారు రాజకీయ మేధావులు.. పార్టీ ప్రస్తుత పరిస్థితి..  లాభ నష్టాల అంచనా.. కూస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇది అతిపెద్ద ప్లస్ పాయింట్ కానుంది.. 

Read More సైన్స్ జీవితానికి ఉపయోగపడాలీ

ఎక్కువ శాతం అధికార పార్టీ వైపే గ్రామీణ ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు అంటే ఆరు గ్యారంటీలు అమలు తీరుపై ఈ ఎన్నికలు ఒక తీర్పులా మారనున్నాయన్నది యదార్ధం.. 

Read More జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం !

బీ.ఆర్.ఎస్. పార్టీ విషయానికి వస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడింది. ఇప్పుడు ఈ ఎన్నికలు సవాలుతో కూడుకున్నవి.. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, అధికారంలో లేకపోవడం మైనస్. ఉనికిని చాటుకోవడానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం అని చెప్పవచ్చు.. 

Read More మాజీ సీఎం రోశయ్యకు ఘన నివాళి

ఇక బీజేపీ పరిస్థితి ఎలా ఉందంటే.. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉంది. ఇంకాస్త మెరుగుపడే అవకాశం ఈ ఎన్నికలు కల్పిస్తున్నాయి.. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు పెంచుకోవాలని చూస్తోంది బీజేపీ.. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్, బీ.ఆర్.ఎస్. పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే గ్రామాల్లో పాత కక్షలు, కొత్త సమీకరణాలు పార్టీల అధికారిక లెక్కలను తలకిందులు చేయగలవు అన్నది జగమెరిగిన సత్యమే.. 

Read More జాతీయస్థాయి కళాకారులకు సన్మానం

ఇక బీసీ రిజర్వేషన్లు : 
ఈ ఎన్నికలపై  బీసీల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది.. ఈ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల అంశం అత్యంత కీలకమైనది. జనాభా ప్రాతిపదికన డిమాండ్ కూడా కీలకంగా వుండబోతోంది.. బీసీ కుల గణన చేపట్టి, వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

ప్రభుత్వ నిర్ణయం : 
కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసే ప్రక్రియలో ఉంది. 50శాతం లోపు పరిమితి ఉండాలా..?  లేదా పెంచాలా అనే దానిపై చట్టపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒకవేళ బీసీలకు ఎక్కువ సీట్లు దక్కితే, గ్రామీణ రాజకీయాల్లో వారి పట్టు మరింత పెరుగుతుంది. ఏ పార్టీ అయితే బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన, అనుకూలమైన స్టాండ్ తీసుకుంటుందో, ఆ పార్టీకి బీసీ ఓటర్ల మద్దతు లభించే అవకాశం ఉంది. రిజర్వేషన్ల ఖరారులో ఆలస్యం లేదా అసంతృప్తి ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

అయితే తెలంగాణ పంచాయతీ ఎన్నికలు కేవలం గ్రామాధికారులను ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు. ఇది రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందా? బీ.ఆర్.ఎస్.  కోలుకుంటోందా? ఇక బీజేపీ బలపడుతోందా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పనుంది. బీసీ రిజర్వేషన్ల తుది నిర్ణయం ఈ ఎన్నికల స్వరూపాన్నే మార్చేయగలదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. చూద్దాం భవిష్యత్తులో ఏమి జరుగనుందో..? 

About The Author