బల్దియా ఖజానాకు గండి.. అక్రమార్కులకు దండి!
- పెద్దల అక్రమ కట్టడాలపై అధికారుల కన్నుమూత?
- దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన కూడలిలోనే లక్షల రూపాయల పన్ను ఎగవేత:
- *మున్సిపల్ ఖజానాకు చేరవలసిన కోట్ల రూపాయల పన్ను సొంత జేబుల్లోకి మళ్లించుకుంటున్న అవినీతి అధికారులు
- ఆధారాలు పొందుపరిచి అవినీతి అధికారుల చిట్టా బయటపెట్టినా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్న :జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్..!
- మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ విజిలెన్స్ , ఏసీబీ అధికారుల చర్యలు ఎక్కడ..?
- మున్సిపల్ శాఖ మాత్యులు సీ.ఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించకపోతే అభాసుపాలు కావడం ఖాయం
సామాన్యుడిపై ప్రతాపం చూపే బల్దియా యంత్రాంగం, కోట్లాది రూపాయల పన్ను ఎగవేస్తున్న అక్రమార్కుల ముందు మోకరిల్లడం సిగ్గుచేటు. దిల్‌సుఖ్‌నగర్ వంటి కీలక ప్రాంతాల్లో వేల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని రికార్డుల్లో మాయం చేస్తూ, ప్రభుత్వ ఆదాయాన్ని సొంత జేబుల్లోకి మళ్లించుకుంటున్న సరూర్ నగర్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ అక్రమాలు బహిర్గతమైనా ఉన్నతాధికారుల నిర్లిప్తత ఆశ్చర్యకరం.
ఆధారాలతో సహా చిట్టా బయటపెట్టినా, జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న 'అంతర్గత ఒప్పందాలు' స్పష్టమవుతున్నాయి. విజిలెన్స్ మరియు ఏసీబీ అధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న ఈ "వసూల్ రాజా"లపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోవడం ఖాయం.
హైదరాబాద్:
సామాన్యుడు చిన్న గది నిర్మించుకుంటే నోటీసులతో విరుచుకుపడే బల్దియా యంత్రాంగం.. వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న వ్యాపార సముదాయాల విషయంలో మాత్రం ‘మామూలు’గా వ్యవహరిస్తోంది. కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సిన చోట అధికారుల నిర్లక్ష్యం, అంతర్గత అవగాహనతో జీహెచ్‌ఎంసీ ఖజానాకు భారీగా గండి పడుతోంది. దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో బహిరంగంగానే నిబంధనలు తుంగలో తొక్కుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
సాయిరామ్ హాస్పిటల్ వెనుక ఉన్న ఒక భవనానికి సంబంధించి అధికారుల తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఒకే యజమానికి చెందిన రెండు డోర్ నంబర్ల (13-8-36/1, 13-8-36) పన్ను మదింపులో నిబంధనల ఉల్లంఘన: ఇక్కడ ఉన్న భారీ టీన్ షెడ్‌ను కనీసం అంచనా వేయకపోవడం, భవనం లో ఎక్కువ భాగం కమర్షియల్ ఉపయోగిస్తున్న ఇంకా రెసిడెన్షియల్ గానే చూపించడం వెనుక అధికారుల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి నిబంధనల ప్రకారం సవరిస్తే, ఇక్కడ పన్ను ₹1.5 లక్షల నుండి ₹2 లక్షల వరకు ఉండాలి. కానీ, కేవలం ₹46,168తోనే సరిపెడుతూ ప్రభుత్వ ఆదాయానికి కోత పెడుతున్నారు.
సాయిబాబా ఆలయ పక్కనే ఉన్న మరో భారీ భవన సముదాయం (డోర్ నెం: 13-9-46/1/NR నుండి 13-9-48/20/NR వరకు) అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక్కడ సుమారు 10 డోర్ నంబర్లు ఉన్నా, పన్ను చెల్లింపులో మాత్రం భారీ గోల్‌మాల్ జరుగుతోంది.
మాయమైన విస్తీర్ణం: క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం గ్రౌండ్ + 2 అంతస్తుల్లో కలిపి కనీసం 30,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. కానీ రికార్డుల్లో మాత్రం కేవలం 18,859 చ.అ. మాత్రమే చూపిస్తున్నారు.
లెక్క తేలని 11,141 చ.అ.: అంటే సుమారు 11,141 చదరపు అడుగుల విస్తీర్ణానికి అసలు పన్నే కట్టకుండా ఏళ్ల తరబడి వ్యాపారాలు సాగిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై ఇంత పెద్ద ఎత్తున అక్రమం జరుగుతున్నా పన్ను విభాగం అధికారులు గుర్తించలేకపోవడం వెనుక ‘అంతర్గత ఒప్పందాలు’ ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
3.అధికార దుర్వినియోగం - వ్యవస్థకు చేటు
దిల్‌సుఖ్‌నగర్‌లోని లోటస్ లాప్ స్కూల్ ఎదురుగా ఉన్న భవనం (PTIN: 1031301113, 1039909688) ప్రభుత్వ అధికారుల అవినీతికి నిలువుటద్దంగా నిలుస్తోంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఏ.ఎం.సి (AMC) గారు తన స్నేహితుల భవనం అనే ఉద్దేశంతో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం గమనార్హం.
ముఖ్యమైన అక్రమాలు:
విస్తీర్ణంలో మోసం: దాదాపు 2000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణాన్ని లెక్కల్లో చూపకుండా పన్ను ఎగవేతకు సహకరించడం.
తప్పుడు అనుమతులు: నివాస గృహంగా (Residential) అనుమతి మరియు ఓ.సి (OC) పొంది, యథేచ్ఛగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం.
అధికార పక్షపాతం: ఒక పూర్తి అంతస్థును రికార్డుల నుండి తొలగించి, పెనాల్టీలను తగ్గించి ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొట్టడం.
సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన అధికారులే ఇలాంటి అక్రమాలకు పాల్పడటం వల్ల నిజాయితీగా పన్ను చెల్లించే పౌరులు నష్టపోతున్నారు. వ్యవస్థలో పేరుకుపోయిన ఇటువంటి అవినీతిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పేదలపై ప్రతాపం.. పెద్దలకు ఆశీస్సులు!
మధ్యతరగతి ఇళ్లకు వెళ్లి రూపాయి వదలకుండా వసూలు చేసే అధికారులు, ఇంతింత పెద్ద వ్యాపార సముదాయాల వద్దకు వచ్చేసరికి గుడ్డివారిగా నటిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ‘వసూల్ రాజా’ల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారుల అండదండలు లేకుండా ఇంత పెద్ద ఎత్తున పన్ను ఎగవేత సాధ్యం కాదని గుసగుసలు వినిపిస్తున్నాయి. బల్దియా ఖజానాకు చిల్లు పెడుతున్న ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, ఎగవేసిన పన్నును వడ్డీతో సహా వసూలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
.jpeg)
