ఓ బాపు…కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానం ప్రసాదించు : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి_

_మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే _

ఓ బాపు…కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానం ప్రసాదించు : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి_

మహేశ్వరం:

మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం మండలం దిల్వార్‌గూడ గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ,“గాంధీజీ కన్న కలలు, ఆశయాలను ఆచరించినప్పుడే దేశం సుభిక్షంగా, శాంతియుతంగా ముందుకు సాగుతుంది. కానీ నేటి తెలంగాణ రాష్ట్రంలో మహనీయుల ఆశయాలను తుంగలో తొక్కుతూ, హింసను ప్రేరేపిస్తూ, అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తోంది. ఓ బాపూ… నువ్వైనా చెప్పు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మీ సాక్షిగా హెచ్చరిస్తున్నాం” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు, నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author