గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో... మెగా వైద్య శిబిరం
ఆటో యూనియన్ సేవలు శ్లాఘనీయం: మాజీ మేయర్ కావ్య.
జవహర్ నగర్ :
ఆరోగ్య వైద్య శిబిరాలు ప్రజల ఆరోగ్య రక్షణకు సూచికలని, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సేవలు శ్లాఘనీయ మనీ జవహర్ నగర్ మాజీ తొలి మేయర్ మేకల కావ్య అన్నారు. ఐకమత్యం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రాంకీ, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సౌజన్యంతో గురువారం మెగా మెడికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య హాజరై మాట్లాడుతూ, పేదల నివాసానికి నిలయమైన జవహర్ నగర్ లో ఆరోగ్య శిబిరం నిర్వహించడం ముదా బావమన్నారు. జవహర్ నగర్ లో గరీబోల్లే ఎక్కువగా నివసిస్తున్నారని వారు కనీస అవసరాలకు నోచుకోక ఇబ్బంది పడుతున్నారని, వారి ఆరోగ్య రక్షణ కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మరిన్ని ఆరోగ్య వైద్య శిబిరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నేడు ప్రజలు ఎక్కువగా సరైన అవగాహన లేక క్యాన్సర్ బారిన పడుతున్నారని, క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలకు సరైన అవగాహన కల్పించి వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు సరైన మోటివేషన్ కల్పించి ఆరోగ్య విషయాల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాంకి, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ తదితర సంస్థల కృషి అభినందనీయమన్నారు. జవహర్ నగర్ పరిధిలోని ప్రజలందరూ ఈ హెల్త్ క్యాంపును సద్వినియం చేసుకొని ఆరోగ్య జవహర్ నగర్ కై పాటుపడాలన్నారు. అనంతరం హెల్త్ క్యాంపులో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆలూరి సంగీత రాజశేఖర్,ఆరోగ్య సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
