*లచ్చిరెడ్డి సేవలు అభినందనీయం ​బి.ఎన్.రెడ్డి నగర్ మాజీ*

మాజీ కార్పొరేటర్‌కు కాలనీవాసుల ఘన సన్మానం.


*లచ్చిరెడ్డి సేవలు అభినందనీయం ​బి.ఎన్.రెడ్డి నగర్ మాజీ*

వనస్థలిపురం:

బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ దుర్గా సాయి నగర్ కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డిని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్పొరేటర్‌గా ఐదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం ఆయనను కలిసి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.
​ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో కాలనీలోని మౌలిక సదుపాయాల కల్పనలో, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో లచ్చిరెడ్డి ప్రత్యేక చొరవ చూపారని కొనియాడారు. ప్రజాప్రతినిధిగా ఆయన అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.

​అభివృద్ధే ధ్యేయంగా పనిచేశా:లచ్చిరెడ్డి

అనంతరం మొద్దు లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. పదవీకాలంలో కాలనీల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేశానని తెలిపారు. కాలనీవాసులు తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ ప్రజా సేవలో ముందుంటానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ముఖ్య నాయకులు దామోదర్ రెడ్డి, నరసింహారెడ్డి, ఎల్లయ్య, యాదగిరి గౌడ్, భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ముత్యాలు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-02-24 at 18.01.09

About The Author