మత్తులో స్టీరింగ్.. ప్రాణాలకు చేటు!
మల్కాజిగిరిలో వీకెండ్ డ్రైవ్: 242 మందిపై కేసులు: చుక్క వేసి చిక్కితే జైలుకే.. హెచ్చరిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
మల్కాజిగిరి:
వీకెండ్ వచ్చిందంటే చాలు.. కొందరు మందుబాబులు మత్తులో జోగుతూ రోడ్లపైకి వస్తున్నారు. తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను సైతం పణంగా పెడుతూ వాహనాలను నడుపుతున్నారు. ఇలాంటి వారిపై మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. గత వారాంతంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా కేసులు నమోదయ్యాయి.
మత్తులో పట్టుబడింది వీరే..
ద్విచక్ర వాహనాలు: 211
కార్ల యజమానులు: 17
ఆటో డ్రైవర్లు: 13
భారీ వాహనాలు: 01
పరిమితి దాటితే ముప్పే!
సాధారణంగా రక్తంలో ఆల్కహాల్ శాతం (BAC) 30mg దాటితే నేరంగా పరిగణిస్తారు. అయితే, ఈ తనిఖీల్లో పట్టుబడిన వారిలో కొందరు ప్రమాదకర స్థాయిలో మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. 10 మంది వాహనదారుల్లో 301 నుండి 550 mg మధ్య BAC రీడింగ్ రావడం ట్రాఫిక్ అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. ఈ స్థాయి మత్తులో వాహనం నడపడం అంటే ఆత్మహత్యా సదృశ్యమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జైలు శిక్ష తప్పదు.. బిఎన్ఎస్ సెక్షన్ 105 ప్రయోగం
కఠినంగా కోర్టు తీర్పులు:
గత వారం (ఫిబ్రవరి 16 - 22) జరిగిన విచారణల్లో 61 డీడీ కేసులు పరిష్కారమయ్యాయి. అందులో ఇద్దరికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించగా, ఒకరికి సామాజిక సేవ చేయాలని కోర్టు ఆదేశించింది. మిగిలిన వారికి భారీగా జరిమానాలు విధించారు.
డ్రైవర్లకు పోలీసుల సూచన:
"మద్యం సేవించి వాహనం నడపడం నేరం. పార్టీలు చేసుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా క్యాబ్ సర్వీసులను వినియోగించుకోవాలి లేదా మద్యం సేవించని స్నేహితులతో ఇంటికి వెళ్లాలి. ప్రాణాల కంటే వినోదం ముఖ్యం కాదు."
