25న కార్మిక లోకం గర్జన

  • బిఎంఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళన
  • ​సర్కారు తీరుపై కార్మికుల కన్నెర్ర
  • ​కనీస పెన్షన్ రూ. 7,500 చేయాలని డిమాండ్

25న కార్మిక లోకం గర్జన

హైదరాబాద్:
తమ సమస్యలను గాలికొదిలేసిన సర్కారు తీరును నిరసిస్తూ కార్మిక లోకం పోరాట బాట పట్టింది. ఈ నెల 25న దేశవ్యాప్తంగా ‘ఆందోళన దినం’ పాటించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) పిలుపునిచ్చింది. పూరిలో జరిగిన అఖిల భారత మహాసభల నిర్ణయం మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు బిఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పు రామిరెడ్డి వెల్లడించారు.  

​వెట్టిచాకిరీ తప్పట్లేదు..

ఐదు దశాబ్దాలుగా సేవ చేస్తున్నా అంగన్‌వాడీలను నేటికీ ‘స్కీమ్ కార్మికులు’గానే చూడటం దారుణమని బిఎంఎస్ మండిపడింది. ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులకు చాలీచాలని వేతనాలిస్తూ వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నేషనల్ టెక్స్‌టైల్స్ కార్పొరేషన్ (NTC) కార్మికులకు 10 నెలలుగా, హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ ఉద్యోగులకు 32 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొంది.  

​ప్రధాన డిమాండ్లు ఇవే..
​పెన్షన్ పెంపు: EPS-95 కింద కనీస పెన్షన్‌ను రూ. 1,000 నుంచి రూ. 7,500కు పెంచి, ద్రవ్యోల్బణ భత్యం (DR) కల్పించాలి.  

​నియామకాలు: ఉద్యోగ నియామకాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి, కొత్త పోస్టులను భర్తీ చేయాలి.  
​క్రమబద్ధీకరణ: కాంట్రాక్ట్, స్కీమ్ కార్మికులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి.  

​సదుపాయాలు: బ్యాంకింగ్ రంగంలో 5 రోజుల పని విధానాన్ని అమలు చేయడంతో పాటు, ESI, EPF పరిమితులను పెంచాలి.  
​ఈ సమస్యలపై 25న నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని, ప్రధాని, ముఖ్యమంత్రులకు వినతిపత్రాలు అందజేయాలని బిఎంఎస్ శ్రేణులకు పిలుపునిచ్చింది.  

ఈ కార్యక్రమంలో ​S. మల్లేశం - అఖిల భారత ఉపాధ్యక్షులు
​T. రామిరెడ్డి - తెలంగాణ BMS ప్రధాన కార్యదర్శి
​యం. రాధాకృష్ణ - హైదరాబాద్ జిల్లా BMS అధ్యక్షులు
​V. రమేష్ - BMS రాష్ట్ర కార్యదర్శి
​T. కృష్ణ - GHMC యూనియన్ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు

About The Author

Related Posts