హాస్టల్ నిర్మాణం చేపట్టాలి

ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారుల నిర్లక్ష్యం ఎందుకు 

  • 647 సర్వేనెంబర్ కు చెందిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భూమిని పరిరక్షించాలి
  • శిశు సంక్షేమం ఆధ్వర్యంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలి 
  • అధికారులు అవకతవకలకు తావిస్తే సహించేది లేదంటూ హెచ్చరికలు 

హాస్టల్ నిర్మాణం చేపట్టాలి

మాజీ మంత్రి మల్లారెడ్డి ఇలాకా జవహర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణల పర్వం మళ్లీ ఊపందుకుంది,... గత తహసిల్దార్ సుచరిత ప్రభుత్వ భూముల పరిరక్షణే ద్యేయంగా కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించి చట్ట విరుద్ధంగా ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడిన అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షార్హులను చేసి ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలంటే అమ్మో ప్రభుత్వ భూమా అనే అంతటి భయాందోళనకు గురిచేసిన తహసిల్దార్ సుచరిత ఘనత నేడు మళ్లీ అక్రమార్కుల్లో సన్నగిల్లుతోంది,... ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారం అధికారుల అండదండలు లేనిదే జరుగుతుందా...? అధికారులే అక్రమార్కులైతే ప్రభుత్వ భూములకు రక్షణ ఎక్కడ ఉంటుంది, అనే విమర్శలు ప్రజల్లో నేడు మళ్లీ అధికమవుతున్నాయి...

శిశు సంక్షేమం ఆధ్వర్యంలో శ్రామిక మహిళా వసతి గృహం ( వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ) నిర్మాణం కోసం కేటాయించిన 647 సర్వేనెంబర్ కు చెందిన ఒక ఎకరా 20 గుంటల స్థలం అక్రమార్కుల హస్తగతం కాకుండా పరిరక్షించి తక్షణమే కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు డెంటల్ కాలేజ్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ స్థలం కోట్లు విలువ చేసే స్థలం కావడంతో కొందరు అక్రమార్కులు ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు లంచాల రూపంలో లక్షలు వెదజల్లి అధికారులను లోబర్చుకునేందుకు అంతు చిక్కని కుటిలేయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి శిశు సంక్షేమం ఆధ్వర్యంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం 647 సర్వేనెంబర్ కు చెందిన ప్రభుత్వ భూమిలో చేపట్టేందుకు 8 కోట్ల నిధులను కూడా కేటాయించడం జరిగిందని ఈ విషయాన్ని బహిర్గతం కాకుండా కొందరు అక్రమార్కులు కోటి కుట్రలు పన్నుతున్నారనే వినికిడి హట్టహాసంగా వినిపిస్తోంది జవహర్ నగర్ జి హెచ్ ఎం సి ప్రాంతంగా అభివృద్ధి చెందిన ఈ సమయంలో శిశు సంక్షేమం ఆధ్వర్యంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం కోసం కేటాయించిన 647 సర్వేనెంబర్ కు చెందిన భూమి అక్రమార్కుల హస్తగతం కాకుండా దారి మళ్లించేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అధికారికంగా కేటాయించిన 8 కోట్ల నిధులతో శిశు సంక్షేమం మహిళా అభ్యున్నతినీ దృష్టిలో పెట్టుకొని హాస్టల్ నిర్మాణం కోసం అధికారులతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు మేధావులు విద్యావంతులు కృషి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారుWhatsApp Image 2026-02-26 at 19.17.39 (2)WhatsApp Image 2026-02-26 at 19.17.39 (1)

About The Author