కుమ్మెర మల్లన్న జాతరలో.... పసికందు మృతిపై అంబేద్కర్ నగర్ లో నిరసన జ్వలలు
నిందితులను శిక్షించాలని అంబేద్కర్ నగర్ సబ్బండ వర్గాల క్యాండిల్ ర్యాలీ
జవహర్ నగర్ :
నాగర్‌కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలో వెలసిన మల్లన్న స్వామి జాతరలో చోటుచేసుకున్న అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆలయదర్శనం కోసం వెళ్ళిన రజక కుటుంబంపై జరిగిన రెడ్డిల దాడిలో రెండు నెలల పసికందు మృతి చెందడంపై ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు సంఘాలు, అంబేద్కర్ నగర్‌లోని బీసీ నేతల ఆధ్వర్యంలో క్యండిల్ ర్యాలీ నిర్వహించాయి. కుమ్మెర
గ్రామానికి చెందిన గణేష్, మౌనిక దంపతులు తమ రెండు నెలల కుమార్తెతో కలిసి మల్లన్న స్వామి దర్శనానికి వెళ్ళారు. బాధితుల కథనం ప్రకారం, ఆలయ ప్రవేశం వద్ద కొందరు వ్యక్తులు వారిని కులం పేరుతో దూషించి లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాట మరియు దాడిలో, నిందితులు కాలితో తన్నడంతో తల్లి చేతిలో ఉన్న చిన్నారి కింద పడి తీవ్రంగా గాయపడింది. గాయపడిన పసికందును ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ నిరసనలో బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ, ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.దాడికి పాల్పడిన వారిపై వెంటనే హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి.పోలీసుల నిష్పాక్షిక ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి.
కుటుంబానికి న్యాయం: బాధిత రజక కుటుంబానికి ప్రభుత్వం రూ. 1 కోటి ఎక్స్‌గ్రేషియా మరియు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. నిందితులపై ఎస్సీ/ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలి.
రాజకీయ మరియు సామాజిక స్పందన ఈ ఘటనపై ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి ) మరియు రాష్ట్ర బీసీ కమిషన్ సీరియస్ అయ్యాయి.తీన్మార్ మల్లన్న,బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
ఒక పసికందు ప్రాణం పోవడానికి కారణమైన కుల వివక్షను సమాజం ఏమాత్రం సహించదు. బాధితులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. నిరసనకారులు ఈ కార్యక్రమం లోపాల్గొన్నా వారు,మాజీ కార్పొరేటర్ మారగోని నాగరాణి,వెంకటేష్,తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ప్రధాన కార్యదర్శి కొలిపాక లక్ష్మన్,రాష్ట్రా ఉపాధ్యక్షులు సాంబ రాజ్ కుమార్,టీ ఆర్ ఆర్ ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శాగంటి వెంకటేష్, టీ ఆర్ ఆర్ ఎస్ మేడ్చల్ జిల్లా యూత్ అధ్యక్షులు, పొలాస సాయి కుమార్, టీ ఆర్ ఆర్ ఎస్ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి పొలాస అశోక్, టీ ఆర్ ఆర్ ఎస్ అంబేద్కర్ నగర్ అధ్యక్షులు సి హెచ్ యాదగిరి,మూల సోమయ్య, కూటికంటి వెంకటేష్,అబ్బాగోని రాజ్ గౌడ్,రామకృష్ణ, భాస్కర్, ప్రభాకర్,డా.యాదగిరి ,బన్నీ,సైదులు, చెంద్రయ్య, లింగచారి, శోభన్, బిక్షపతి,రమేష్, శ్రీధర్, ఎం వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.
