పంచాయితీ ఎన్నికల్లో గంపగుత్త బేరాలు..!
- కళ్లుచెదిరే బహుమతులు అందిస్తున్న అభ్యర్థులు..
- ఏకగ్రీవాలు చేసేందుకు అన్ని పార్టీల కసరత్తులు..
- ప్రభావం చూపనున్న కులం, డబ్బు, మద్యం ఇతరాలు..
- దౌర్జన్యంతో, భయోత్పాదం సృష్టించడం మరొక ఫంథా..
- రాజకీయ పలుకుబడి, ఆశలు కలిగించే వాగ్ధానాలు మరో ఎత్తు..
- వ్యక్తిగత పేరు ప్రతిష్ఠలున్నవారు కొంతవరకే కనిపిస్తున్నారు..
- నీతి, నిజాయితీ అన్న పదాలు ఏనాడో నిర్వీర్యం అయిపోయాయి..
- ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడం అనే ప్రక్రియ భ్రష్టుపట్టింది..
- వేలంపాటలో అభ్యర్థులను ఎన్నుకోవడం కూడా జరుగుతోంది..
- గ్రామాల్లో పట్టు కోల్పోతున్న నీతిమంతమైన రాజకీయాలు..
- పల్లెల అభివృద్ధి అటకెక్కింది.. దేశ అభివృద్ధి అమ్ముడుపోతోంది..
- పంచాయితీ ఎన్నికల ప్రసహనంపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న స్పెషల్ స్టోరీ..
.jpg)
( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ ) :
తెలంగాణ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రకరకాల విన్యాసాలు చోటుచేసుకుంటున్నాయి.. అభ్యర్థులు తమ మేధస్సును వుపయోగించి మరీ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడిపోయారు.. కొందరు డబ్బు ఆశ చూపిస్తున్నారు.. కొందరు కాంట్రాక్టులంటూ, మరికొందరు మందు అంటూ ఇంకా ఏవేవో చెబుతూ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.. కానీ కొందరు మేధావులు మాత్రం గంపగుత్త బేరాలు పెడుతున్నారు.. కులం, పరిచయం, స్నేహం అనే పదాలను అల్లుకుని ఒక గుంపును కొనేస్తున్నారు.. దీన్నీ గంపగుత్త బేరాలు అంటారు.. ఇక కొంతమంది రకరకాల ఆశలు చూపి, తాయిలాలు అందిస్తూ తమ గెలుపును ఏకగ్రీవం చేసుకుంటున్నారు.. మరికొందరు తమ పంచాయతీని దత్తతు తీసుకుంటున్నారు.. ఇలా రక రకాలుగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే రాజకీయ విశ్లేషకులు ఇలాంటి పరిణామాలు తలనొప్పులు తీసుకుని వస్తాయని హెచ్చరిస్తున్నారు.. చూద్దాం మరి ఎవరెవరు విజయం అందుకుంటారో..?
వచ్చే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంతే టి.జీ.ఎస్.ఈ.సి. నిర్వహిస్తున్న 2025–26-పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, “ఏకగ్రీవాలు, ఓట్ల కొనుగోలు, ఓటర్లకు బహుమతులు, వాగ్ధానాలు.. ఇవన్నీ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశ అంశాలుగా మారిపోయాయి.. క్రింది విశ్లేషణలో ప్రస్తుతం బయటకొస్తున్న రాజకీయ వ్యూహాలు, వాటి ప్రభావాలు, అలాగే ఎన్నికల సంఘం ప్రయత్నాలు, సమస్యలు ఇవన్నీ సమగ్రంగా పరిశీలిద్దాం..
టి.జీ.ఎస్.ఈ.సి. ఇటీవల ఏకగ్రీవాలపై కఠిన మార్గదర్శకాలు అంటే గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఏకగ్రీవంగా అంటే పోటీ లేకుండా ఒకే అభ్యర్థి ద్వారా పంచాయతీ పదవి ఖాయం చేసుకోవాలంటే, ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి చేయాలని స్పష్టం చేసింది. మోసాలు, బెదిరింపులు, ఆకర్షణలు లేకపోవడం మెయింటైన్ చేయాలని సూచించింది..
ఖచ్చితంగా నిబంధనల మేరకు ఏకగ్రీవం అయితే మాత్రమే ఫలితం ప్రకటించాలని, ఏకగ్రీవం అక్రమ మార్గంలో జరిగితే మాత్రం ఆ ఎన్నికను రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.. కాగా ప్రథమ దశలోనే సుమారు 150పైగా గ్రామ పంచాయతీలు పోటీ అనేది లేకపోవడంతో ఏకగ్రీవంగా ఫలితం ప్రకటించుకోవడం జరిగింది.
అధికారులకు, అభ్యర్థులకు, ప్రజలకు ఏకగ్రీవం అనేది అంత సులభమైన మార్గం కాదని సులభ మార్గం కాదు అని టి.జీ.ఎస్.ఈ.సి. స్పష్టం చేస్తోంది. ఇది వాస్తవంగా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఒక అడుగు మాత్రమే అని భావించాలి..
సమస్యలు :
గతంలో, కూడా ఏకగ్రీవం చేయడం సులభం.. అనుకునే ధోరణి ఉండేది. అయితే ఇప్పుడు, “ఏకగ్రీవాల కోసం మోసాలు, బెదిరింపులు, కరెన్సీ, బహుమతుల వితరణ వంటి జోక్యాలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి.
ప్రస్తుత పరోస్తితుల్లో ఏకగ్రీవాలు జరుగుతున్నా.. గ్రామ స్థాయిలో పరిణామాలు, స్థానిక రాజకీయ వాతావరణం, వర్గాలు, బలగాల ప్రేరణ వంటివి చాల సంక్లిష్టం. అంతేకాకుండా, ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లుగా చూపించడానికి బెక్‌డోర్ ఒప్పందాలు అంటే అక్రమ మార్గాల ద్వారా ఒప్పొందాలు జరిగే ప్రమాదాలు ఉన్నాయి. మొత్తం మీద ఏకగ్రీవాల పునరాలోచన బాగుంది. కానీ శక్తివంతంగా అమలు, స్వతంత్ర, పారదర్శక పర్యవేక్షణ లేకపోతే, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మిగిలిపోతుంది.. అంటే అంగబలం, అర్ధబలం ఉన్నవాడే ఎన్నికయ్యే ప్రమాదం ఉంటుంది..
ఓట్ల కొనుగోలు :
ఈ ఎన్నికల్లో ఓట్లను గంపగుత్తగా కొనడమే కాకుండా.. అబద్దపు వాగ్ధానాలు, బహుమతులను పంచడం.. భరోసా ఇస్తామని నమ్మించడం, అమలుకు వీలుగాని హామీలు గుప్పించడం వంటివి విస్తృతంగా వినిపిస్తున్నాయి.. కనిపిస్తున్నాయి..
ఉదాహరణకు, ఒక జిల్లాలో కొంతమంది అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఫ్రిజ్, గ్రైండర్లు, ఇతర హోమ్ అప్లయిన్సులు ఇవ్వడం ప్రారంభించారు. ఈ బహుమతులకు సంబంధించి, వారు ఒక్క ఓటర్‌కు సుమారు రూ. 2,000 ఖర్చు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
ఈ విధానాన్ని వారు “వోటుకు బదులుగా బహుమతి, ఉపకరణం గా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు.. తద్వారా తమకు న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవకుండా తప్పించుకోవచ్చని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది..
బహుమతులు మాత్రమే కాకుండా అలవిగాని హామీలు కూడా గుప్పిస్తున్నారు.. కొంతమంది అభ్యర్థులు ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు, జీవిత బీమా, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిసామని వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఇవి తెలంగాణ గ్రామ స్థాయి ప్రజల్లో అమ్ముకోవడం, కొనడం అనే ఒక వ్యాపారాత్మక ధోరణికి దారితీస్తోంది.. ఇక బడ్జెట్ ఎక్కువగా ఖర్చవుతున్నా, ఓటర్ల ఇష్టాలను, వర్గాల కోరికలు ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి.. చివరికి ఇది ఒక సాధారణ వ్యూహంగా మారుతోంది. అయితే రాజకీయ పార్టీలు మాత్రం ఈ వ్యవహారాన్ని పవర్ ప్లస్ బిజినెస్ ప్లస్ భవిష్యత్తు కన్సాలిడేషన్ గా చూస్తున్నారు:
సర్పంచిగా ఎన్నికైన వారికి పంచాయతీ హోదా ద్వారా స్థానిక సంస్థల మీద నియంత్రణ, అర్ధిక అవకాశాలు, గ్రాంట్లు, కాంట్రాక్టులు రావచ్చు. అందుకే ప్రజాసేవకు కాకుండా కేవలం పవర్ పొందే వ్యక్తిగా వారు కీర్తించబడుతున్నారు..
అయితే ఈ ఎన్నికలు చాలా గ్రామాల్లో సర్పంచిగా గెలవడం కంటే రాజకీయ పార్టీల ప్రహసవం.. పార్టీల భవిష్యత్తు, బలం అనే అంశాలకు ఉదాహరణగా నిలుస్తున్నారు.. ఇక స్థానిక వ్యవహారాల పరంగా అవినీతి, పెరుగుతున్న ఖర్చులు, ప్రజల ఒత్తిడులు ఇవన్నీ గ్రామాల్లో పరిపాలనను, గ్రామాల అభివృద్ధికి అడ్డుగోడగా నిలుస్తున్నాయి..
ఎన్నికల సంఘం చేపడుతున్న విధి విధానాలు :
టి.జీ.ఎస్.ఈ.సి. ఇప్పటికే ఏకగ్రీవాలపై కఠిన మార్గదర్శకాలు, ధ్రువీకరణ పత్రాల విధానం, ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు వంటి చర్యలు ప్రకటించింది. అందులో భాగంగా, నామినేషన్ ఉపసంహరణలు పదవుల “బెడ్స్”, బాహ్య ఒత్తిళ్లు, వాగ్దానాలు, బహుమతుల వితరణపై ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించింది. అంతేకాకుండా ఎన్నికల ఖర్చుల పారదర్శకత కోసం అభ్యర్థులకు ప్రత్యేక బ్యాంక్ ఖాతా అవసరం అని స్పష్టం చేసింది.. అందులో నుంచి మాత్రమే ఎన్నికలకు సంబంధించిన ఖర్చులు నిర్వహించాలని మార్గదర్శకాలు విడుదల చేసింది.. ఇది బ్లాక్ మనీ, నగదు లావాదేవీలపై కొంత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది..
పరిమితులు :
కానీ గ్రామస్థాయిలో, స్థానిక రాజకీయం, వర్గాలు, సంప్రదాయాలు, భారం ఉన్న వనరులు,, ఇవన్నీ టి.జీ.ఎస్.ఈ.సి. అధికారాలు ఆశించినంత వేగంగా నియంత్రించలేకపోతున్నాయి. ఫిర్యాదులు వచ్చిన తర్వాతనే చర్యలు తీసుకుంటున్నారు.. అంటే ముందస్తు చర్యలకంటే.. ప్రమాదం జరిగిపోయిన తర్వాత అంటే “ప్రివెంటివ్” కంటే “పో-ఫ్యాక్ట్” చర్యలు కనిపిస్తున్నాయి.
సాధ్యమైన పరిష్కారాలు :
ఎక్కడ ఏకగ్రీవం జరిగినదో, ఏమేమి వాగ్ధానాలు ఇచ్చారో..? ఎలాంటి బహుమతులు అందజేశారో.. అన్న వివరాలు జిల్లా-లెవెల్‌లో అందుబాటులో ఉండాలి. ప్రజలకు తెలియజేసే బాధ్యత తీసుకోవాలి.. స్థానిక ముఖ్యమైన వారు, ప్రజా సమాఖ్యలు, వాకింగ్ ప్యానెల్‌లు ఇలాంటివి ప్రతి గ్రామంలో అమలు చేయాలి..
ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.. పదవీ కాంక్ష అనేది మాత్రమే కాకుండా.. పదవిని సేవా భావనతో వినియోగించాలి.. ఎలాంటి స్వలాభేక్ష లేకుండా పనిచేయాలనే అవగాహనను అభ్యర్థుల్లో కలిగించ గలగాలి.. అలాగే అభ్యర్థులు తప్పని సరిగా తమ బ్యాంకు ఖాతాకు సంబంధించిన రిసిప్ట్స్, రియల్ టైం ఆడిటింగ్ లు, అధికంగా ఖర్చుచేయడం నియంత్రించడం వంటికి కఠినంగా అమలుచేయాలి.. తప్పినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..
కాగా ఈ ఎన్నికలు.. సాధారణ గ్రామ వాతావరణాన్ని, ప్రజల స్వప్నాలను, వర్గాల రాజకీయాల్ని, నిధుల వినియోగాన్ని ఒక్క చోట మిళితం చేస్తున్నాయి. ఇది ఒక సాధారణ ప్రజా ఎన్నిక కాదు; ఇది తక్కువ స్థాయిలోనే అయినా “పెద్ద రాజకీయ, దారుణ, దోపిడీ, సేవా వాగ్దానం.. ఇవన్నీ కలగలిపిన ఒక మేళవింపు అని చెప్పుకోవచ్చు..
టి.జీ.ఎస్.ఈ.సి. చేస్తున్న ప్రయత్నాలు :
మంచి మార్పు రావాలంటే ప్రజల, గ్రామాల, పార్టీల స్వచ్చంద నిర్ణయాలు, పర్యవేక్షణ, పారదర్శకత, కట్టుబాటు.. ఇవన్నీ ఒకేసమయంలో అమలవగలగాలి.. లేకపోతే ఏకగ్రీవాలు, గంపగుత్తగా ఓట్లను కొనుగోలు చేయడం, ప్రలోభపెట్టడం అనే అంశాలు మరింత పెరుగవచ్చు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు..
