నేటి భారతం :

download

హైదరాబాద్ కలలతో కలిసి పరుగులు తీసే నగరం.. 
కానీ ఆ కలలను సైతం కొల్లగొడుతున్నారు అధికారులు.. 
ఈ నగర వీధుల్లో ప్రతి అడుగు పోరాటమే.. 
కానీ ప్రతి మూలలో అవకాశాల వాసన వెదజల్లుతూనే ఉంది.. 
హైదరాబాద్ లో సామాన్యుల జీవితం వేగంగా పరిగెడుతున్నప్పటికీ.. 
ఇక్కడి పరిస్థితులు మాతం చార్మినార్ గడియారంలా నిలిచిపోతున్నాయి.. 
ఇక్కడ జీవించడం అంటే.. ట్రాఫిక్‌లో ఓర్పు, పనిలో పోరాటం తప్పనిసరి.. 
అయినా సారీ ఈ నగరం ఎప్పుడూ ఆగదు.. 
ఎందుకంటే ప్రతి ఒక్కరి కలలు ఇక్కడే సాకారం అవుతాయి.
పాలకుల, అధికారుల అవినీతి అడుగడుగునా పేరుకుపోయినా.. 
ఈ మహానగర జీవితం మనల్ని మార్చుతుంది..  
సహనం నేర్పుతుంది, శ్రమను విలువైనదిగా చేస్తుంది.
ఇక్కడ మనం పడుతున్న ప్రతి కష్టం వెనుక ఒక విజయవంతమైన 
కథ సాక్షాత్కరిస్తుంది.. ఇది మాత్రం అక్షరాలా నిజం.. 

- బోయినపల్లి రమణా రావు, సీనియర్ జర్నలిస్ట్..

About The Author