నేటి భారతం :

గ్రామం బలపడితే దేశం బలపడుతుంది..
పంచాయితీ నిజాయితీగా పని చేస్తే
ప్రజాస్వామ్యం పుష్పిస్తుంది.
గాంధీజీ చెప్పినట్లే భారత ఆత్మ
గ్రామాల్లోనే ఉంటుంది..
ఆ ఆత్మను కాపాడేది జనమే,
జనాలకు సేవ చేసే పరిపాలనే.
కానీ ఇవన్నీ చెప్పుకోవడానికి
మాత్రమే గొప్పగా ఉన్నాయి..
పట్టుకొమ్మల్లాంటి పల్లెలను
నిర్వీర్యం చేస్తున్నాయి రాజకీయాలు..
డబ్బు, మద్యం వెదజల్లి తమకు
అనుకూలంగా మార్చుకుంటున్నాయి..
ఇది దేశ అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది..
రేపు జరుగబోయే పంచాయితీ ఎన్నికల్లో..
విజ్ఞతతో ఓట్లు వేయండి.. పవిత్రమైన ఓటును
అమ్ముకోకండి..
- వీజీ ( సీనియర్ జర్నలిస్ట్ )
About The Author
03 Mar 2026
