నేటి భారతం :

download (6)

ఎన్నికల సంఘం అనేది ఎంతో పఠిష్టంగా ఉండాలి.. 
నీతిగా, నిజాయితీగా, నిర్భయంగా పనిచేయగలిగి ఉండాలి.. 
అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.. 
ఓటేసిన ప్రజలకు సరైన న్యాయం జరుగుతుంది.. 
కానీ ప్రస్తుతం విశిష్టమైన ఎన్నికలసంఘం కూడా.. 
అధికార పార్టీలకు అమ్ముడుపోతోంది.. 
శేషన్ లాంటి డేరింగ్, డేషింగ్ అధికారులు.. 
భూతద్దం పెట్టి వెదికినా కనిపించడం లేదు.. 
కేవలం డబ్బు మాత్రమే ఎన్నికల సంఘాన్ని శాసిస్తోంది.. 
దీంతో ఓట్లేసే ప్రజలు కూడా తప్పుదారి పడుతున్నారు.. 
డబ్భులు, బీరు బాటిళ్లకు, బిర్యానీ పొట్లాలకు.. 
అత్యంత దారుణంగా అమ్ముడుపోతున్నారు.. 
అవినీతి నాయకులకు పట్టం కడుతున్నారు.. 
తాము ఎన్నికల్లో ఖర్చుపెట్టినదానికి, 
వంద రేట్లు అవినీతి మార్గాల్లో ప్రజల నుంచే కొల్లగొడుతున్నారు.. 
పరిస్థితులు ఎప్పుడు మారతాయి అని భరతమాత 
కన్నీళ్లతో ఎదురుచూస్తోంది.. 

Read More ఎన్నికలలో రిటర్నింగ్ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

- బోయినపల్లి రమణా రావు ( సీనియర్ జర్నలిస్ట్ ) 

Read More అంధుల పాఠశాల విద్యార్థినితో కలిసి పాడిన జిల్లా కలెక్టర్

About The Author