ఓటీటీలో ప్రత్యేక ఆఫర్‌తో.. ఎక్కడంటే

స్టార్స్‌ లేకుండా, బడ్జెట్‌తో తెరకెక్కి సంచలనం సృష్టించిన ట్రయాంగిల్‌ లవ్‌స్టోరి సాయి రాజేశ్‌ (Sai rajesh) దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి చైతన్య(Vishnavi CHaitanya), విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రలో ఎస్‌కెఎన్‌ నిర్మించిన ఈ చిత్రం జులై 14న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆనంద్‌, వైష్ణవిల నటన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.80 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్‌ శుభవార్త చెప్పింది. తెలుగు ఓటీటీ ‘ఆహా’ (aha) వేదికగా ‘బేబీ’ స్ర్టీమింగ్‌ కానుంది తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ ట్వీట్‌ చేసింది. ఆగస్టు 25 నుంచి ఈ సినిమా ఆహా వేదికగా స్ర్టీమింగ్‌ కానున్నట్లు తెలియజేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఆహా గోల్డ్‌’ మెంబర్‌షిప్‌ ఉన్నవారు 12 గంటల ముందే ఈ చిత్రాన్ని చూడొచ్చని పేర్కొన్నారు. కథ: వైషు (వైష్ణవి చైతన్య) ఓ బస్తీ అమ్మాయి. చిన్నప్పటి నుంచి తన ఎదురింట్లో ఉండే ఆనంద్‌ (ఆనంద్‌ దేవరకొండ)ను ప్రేమిస్తుంటుంది. ఆ ప్రేమను అతనూ అంగీకరిస్తాడు. స్కూల్‌ డేస్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమ తారాస్థాయికి చేరుతుంది. పదో తరగతి ఫెయిల్‌ కావడంతో ఆనంద్‌ ఆటో డ్రైవర్‌గా స్థిరపడతాడు. వైష్ణవి ఇంటర్‌ పూర్తి చేసి పేరున్న ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో చేరుతుంది. అక్కడ కొత్త పరిచయాలతో వైషూ ఆలోచనా విధానంలో మార్పులు మొదలవుతాయి. ఈ క్రమంలోనే ఆమె తన క్లాస్‌మేట్‌ విరాజ్‌కు దగ్గరవుతుంది. ేస్నహం పేరుతో మొదలైన ఆ బంధం అడ్డదారులు తొక్కుతుంది. ఈ క్రమంలోనే అనుకోని పరిస్థితుల వల్ల విరాజ్‌కు వైష్ణవి శారీరకంగా దగ్గరవ్వాల్సి వస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? వీరిద్దరి వ్యవహారం ఆనంద్‌కు తెలిసిందా? నిజం తెలిశాక తను ఎలా స్పందించాడు? అలాగే విరాజ్‌కు వైష్ణవి – ఆనంద్‌ల ప్రేమకథ తెలిసిందా? ఈ ఇద్దరిలో వైష్ణవి ఎవర్ని ప్రేమించింది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఓటీటీలో ప్రత్యేక ఆఫర్‌తో.. ఎక్కడంటే

స్టార్స్‌ లేకుండా, బడ్జెట్‌తో తెరకెక్కి సంచలనం సృష్టించిన ట్రయాంగిల్‌ లవ్‌స్టోరి సాయి రాజేశ్‌ (Sai rajesh) దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి చైతన్య(Vishnavi CHaitanya), విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రలో ఎస్‌కెఎన్‌ నిర్మించిన ఈ చిత్రం జులై 14న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆనంద్‌, వైష్ణవిల నటన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.80 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్‌ శుభవార్త చెప్పింది.

తెలుగు ఓటీటీ ‘ఆహా’ (aha) వేదికగా ‘బేబీ’ స్ర్టీమింగ్‌ కానుంది తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ ట్వీట్‌ చేసింది. ఆగస్టు 25 నుంచి ఈ సినిమా ఆహా వేదికగా స్ర్టీమింగ్‌ కానున్నట్లు తెలియజేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఆహా గోల్డ్‌’ మెంబర్‌షిప్‌ ఉన్నవారు 12 గంటల ముందే ఈ చిత్రాన్ని చూడొచ్చని పేర్కొన్నారు.

కథ:
వైషు (వైష్ణవి చైతన్య) ఓ బస్తీ అమ్మాయి. చిన్నప్పటి నుంచి తన ఎదురింట్లో ఉండే ఆనంద్‌ (ఆనంద్‌ దేవరకొండ)ను ప్రేమిస్తుంటుంది. ఆ ప్రేమను అతనూ అంగీకరిస్తాడు. స్కూల్‌ డేస్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమ తారాస్థాయికి చేరుతుంది. పదో తరగతి ఫెయిల్‌ కావడంతో ఆనంద్‌ ఆటో డ్రైవర్‌గా స్థిరపడతాడు. వైష్ణవి ఇంటర్‌ పూర్తి చేసి పేరున్న ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో చేరుతుంది. అక్కడ కొత్త పరిచయాలతో వైషూ ఆలోచనా విధానంలో మార్పులు మొదలవుతాయి. ఈ క్రమంలోనే ఆమె తన క్లాస్‌మేట్‌ విరాజ్‌కు దగ్గరవుతుంది. ేస్నహం పేరుతో మొదలైన ఆ బంధం అడ్డదారులు తొక్కుతుంది. ఈ క్రమంలోనే అనుకోని పరిస్థితుల వల్ల విరాజ్‌కు వైష్ణవి శారీరకంగా దగ్గరవ్వాల్సి వస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? వీరిద్దరి వ్యవహారం ఆనంద్‌కు తెలిసిందా? నిజం తెలిశాక తను ఎలా స్పందించాడు? అలాగే విరాజ్‌కు వైష్ణవి – ఆనంద్‌ల ప్రేమకథ తెలిసిందా? ఈ ఇద్దరిలో వైష్ణవి ఎవర్ని ప్రేమించింది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

About The Author

Related Posts