.jpeg)
సంగారెడ్డి :
దళిత జర్నలిస్టుల ఫోరం స్థాపించి పదేళ్లు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభసందర్భంగా మంగళవారం అంబేద్కర్ కార్యాలయం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి జర్నలిస్టులు పరస్పరం శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబేద్కర్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు కొండాపురం జగన్ విచ్చేసి మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల ఫోరం జర్నలిస్టుల హక్కుల సాధనకు, సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలను మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా చేరవేయడం ప్రతి జర్నలిస్టు యొక్క బాధ్యతగా భావించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నాయకుని గోవర్ధన్, దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తలారి యాదగిరి, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు రాపాక విజయరాజు, పుల్కల్ మండల ప్రధాన కార్యదర్శి బేగరి రవికుమార్, నాగేశ్వర్ రావు, రాజు, సురేష్, చంద్రకాంత్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.