
కామారెడ్డి :
గుండె ఆపరేషన్ నిమిత్తమై హైదరాబాదు లోని ప్రైవేటు వైద్యశాలలో షేక్ మజార్ఉద్దీన్ (70) వృద్ధునికి అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో రక్తదాత చంద్రశేఖర్ రెడ్డి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది సకాలంలో రక్తం అందక తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వారి ప్రాణాలను కాపాడడానికి రక్తదాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సకాలంలో రక్తం అందనట్లయితే ఎంతో విలువైన ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందని అన్నారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత చంద్రశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.