బిజెపి బీఆర్ఎస్ పార్టీలకు స్థానిక ఎన్నికలవేళ షాక్ భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరిక

కామారెడ్డి జిల్లా :
బీజెపి, బిఆర్ఎస్ పార్టీల నుండి పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిప్పాపూర్, బిక్నూర్, గ్రామాల నుండి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం, స్థానిక అభివృద్ధి పనులకు ఆకర్షితులై శుక్రవారం తమ పార్టీలను వదిలేసి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
About The Author
06 Dec 2025
