ర్యాండమైజేషన్ విధానంలో ఎన్నికల సిబ్బందికి కేటాయింపు

WhatsApp Image 2025-12-04 at 6.27.28 PM

కరీంనగర్ : 
గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండవ విడత పోలింగ్ సిబ్బంది కేటాయింపు ర్యాండమైజేషన్ విధానంలో పూర్తి చేశారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సాధారణ పరిశీలకులు వెంకటేశ్వర్లుతో కలిసి రెండో విడత పోలింగ్ ఆఫీసర్లను, సిబ్బందిని ర్యాండమైజేషన్ విధానంలో కేటాయించారు. జిల్లాలో రెండో విడతలో చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం మండలాల్లో నిర్వహించనున్న ఎన్నికలకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న సిబ్బందిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, నోడల్ అధికారులు పాల్గొన్నారు. 

Read More అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం

About The Author