
కరీంనగర్ :
క్రీడలు విద్యార్థులకు మానసికొల్లసానికి ఉపకరిస్తాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి ఎస్జీఫ్ బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని శక్తివంతమైన క్రీడలలో బాస్కెట్బాల్ క్రీడా ఒకటని, విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయులచే నిర్వహించిన పోటీలకు ఎంపిక చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన వనరులు సైతం కల్పించి దాగివున్న ప్రతిభను వెలికి తీస్తున్నామని చెప్పారు. ఇటీవల కాలంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలలో పాఠశాలకు చెందినటువంటి బి. సిద్ధార్థ, 10వ తరగతి మరియు ముక్తహసిని 9వ తరగతి అత్యుత్తమ ప్రతిభను కనబరచడమే కాకుండా జాతీయ స్థాయి పోటీలకు సైతం ఎంపికయ్యారని చెప్పారు. జాతీయ స్థాయి పోటీలలోను విశేష ప్రతిభను ఆకాంక్షిస్తూ పుష్పగుచ్చాలను అందజేసి ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.