
సంగారెడ్డి :
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ, ఇతర విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అత్యున్నత విశ్వవిద్యాలయాలలో అవకాశాలను కల్పించేందుకు అంతర్జాతీయ స్కాలర్షిప్లు పొందడం లక్ష్యంగా బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్మాణాత్మక అవగాహన శేషంలు శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని స్టడీ సర్కిల్ డైరెక్టర్ టి ప్రవీణ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమాలను ఐఎల్టిఎస్ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకు ఆసక్తిగల విద్యార్థులు, డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు ఈనెల 21వ తేదీ వరకు టీజీ బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ https://www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9949592991, 9494390803, నంబర్లలో, లేదా బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని కోరారు.