
కరీంనగర్ :
అఖిలభారత సివిల్ సర్వీసెస్ నాటికల పోటీలలో విద్యా వైద్యం పై అవగాహన అనే నాటికను రచించి ప్రదర్శించారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం పొంది జాతీయస్థాయిలో ప్రదర్శనకు ఎంపిక అయినందుకు రచయిత, దర్శకుడు, ప్రభుత్వ వైద్య కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ అగస్టీన్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వసంత, హెల్త్ ఎడ్యుకేటర్ రేష్మ, ఆఫీస్ సూపరిండెంట్ రుక్సానా బేగం, హెల్త్ సూపర్వైజర్ ఇందిరలను అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 137 A ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యా వైద్యం పై అవగాహన అనే ఈ నాటికను సామాన్యులకు అర్థమయ్యే రీతిలో బహు చక్కగా రచించి ప్రదర్శించారని ప్రశంసించారు. ఈ నాటకం రాష్ట్రస్థాయిలోనే, కాకుండా జాతీయ స్థాయిలో అవార్డును సాధించాలని, ఇలాంటి సామాజిక హిత కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి, జిల్లా గవర్నర్ అచీవర్స్ స్కూల్ ప్రిన్సిపల్ చెరిమల వెంకటేశ్వర్లు, కుమారస్వామి, నాగేశ్వర్, కొంజర్ల మహేష్, పులాల శ్యామ్, విద్యాసాగర్ రెడ్డి, సుధాకర్, పండుగ నాగరాజు, అడ్వకేట్ సుద్దపల్లి ప్రసాద్, నాజియా, రేణుక అలయన్స్ క్లబ్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.