అంగరంగవైభవంగా అయ్యప్పస్వామి మహా పడిపూజ
అయ్యప్ప స్వామి నామస్మరణ, కీర్తనలతో మారుమ్రోగిన శివాలయం పీఠం

మణుగూరు :
పట్టణంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ ఆవరణలో గల శివాలయం పీఠంలో అయ్యప్పస్వామి మహపడిపూజ మహోత్సవం యాకయ్య గురుస్వామి, అర్చకులు బాలాజీ శర్మ నేతృత్వంలో అత్యంత వైభవంగా కన్నులపండువగా జరిగింది. గురువారం రాత్రి శివాలయం పీఠంలో అయ్యప్ప మాలలు ధరించిన వర్రే వెంకటేశ్వరరావు ( కిరణ్), కనుకు రమేష్, నరేంద్ర రెడ్డి, నిమ్మనగోటి పుల్లారావు, నిమ్మనగోటి అఖిల్ స్వాముల ఆధ్వర్యంలో అర్చకులు బాలాజీ శర్మ కలశాలు పెట్టి వేద మంత్రోచ్చారణతో అంగరంగ వైభవంగా మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన హరిహర తనయుడు తన్మయత్వం చెందేలాగా శరణం శరణం అయ్యప్ప.. స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో భజన కీర్తనలతో స్వాములు, భక్తులు పరవశించిపోయారు. పీఠంలో మాలలు ధరించిన స్వాములు గానమృతాలతో భజనలు చేస్తుంటే వీక్షించే భక్తులు అయ్యప్పస్వామి నామస్మరణ చేస్తుంటే శివాలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ముందుగా నిత్యపూజలో భాగంగా పీఠంలోని వర్రే వెంకటేశ్వరరావు ( కిరణ్), కనుకు రమేష్, నరేంద్ర రెడ్డి, పుల్లారావు, అఖిల్ స్వాములతో అర్చకులు బాలాజీ శర్మ గౌరమ్మను చేసి గణపతి హోమం, సమస్త దేవతా ప్రార్థన, కలశాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలతో ప్రాణప్రతిష్ఠ చేశారు. అనంతరం అగ్రగణుడు గణపతి పూజ, అష్టోత్తర శతనామావళి, దూపము, నైవేద్యము, కర్పూర హారతి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పూజ, అష్టోత్తరశత నామావళి, దూపము, నైవేద్యము, కర్పూర హారతి, శ్రీ అయ్యప్ప స్వామిపూజ,శ్రీ అయ్యప్ప స్వామి అంగపూజ, అష్టోత్తర శత నామావళి పూజ, దూపము, దీపము, నైవేద్యము,హారతి, శ్రీ అయ్యప్ప స్వామి శరణు ఘోషఅయ్యప్ప స్వామికి కలశాలతో అభిషేకము, పంచామృతాలతో అభిషేకాలు, వేద మంత్రాల నడుమ పుష్పాభిషేకం, స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి పడిపూజను నిర్వహించి పడిని వెలిగించారు. అనంతరం మంత్రపుష్పం, ఆత్మ ప్రదక్షణ, భూతనాధ సోత్ర రత్నావళి, మంగళ హారతి,క్షమాపణ మంత్రాన్ని తో పూజా కార్యక్రమాన్నినిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలోపాల్గొన్నారు. భక్తులందరికీ యాకయ్య, విద్యాసాగర్ రెడ్డి గురుస్వాములు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం పడిపూజ నిర్వహించిన స్వాములు ఏర్పాటు చేసిన ఆల్ఫాహార ప్రసాదంను భక్తులు, స్వాములు స్వీకరించారు. ఈ మహపడిపూజ మహోత్స వానికి అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మర ణం, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించి పేటతుళ్ళి ఆడారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు నుకలపాటి నాగేశ్వరరావు, బోడ బాలాజీ, మోర్ శ్రీను, సత్తి, మోహన్ లాల్, సదానందం, కన్నె, కత్తి, గద, పెరు స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
