కాంగ్రెస్ లో చేరిన బద్దిపల్లి, బహదూర్ఖాన్ పేట స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థులు

పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జి వెలిచాల

WhatsApp Image 2025-12-04 at 6.03.50 PM

కరీంనగర్ : 

Read More జాతీయస్థాయి కళాకారులకు సన్మానం

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బి ఆర్ ఎస్, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని  కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కొత్తపల్లి మండలం బద్దిపల్లి, కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేట గ్రామాలకు చెందిన నాయకులు, స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి తాండ్ర రాజశేఖర్, గుర్రం తిరుపతి రెడ్డిల ఆధ్వర్యంలో యువకులు  కాంగ్రెస్ పార్టీలో చేరగా రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావ్ మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గంలో యువతీ యువకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను సర్పంచులుగా గెలిపించేందుకు కష్టపడి పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో యువత ముందుండి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తద్వారా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో కీలకంగా వ్యవహరించాలని కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పై నమ్మకంతో పార్టీలో చేరిన తాండ్ర రాజశేఖర్ తో పాటు యువకులకు, గుర్రం తిరుపతి రెడ్డిలకు రాజేందర్రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పల్లెలు అభివృద్ధి చెందుతేనే జిల్లా, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతుందని రాజేందర్ రావు పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధిని అడ్డుకునే వారిని ఎన్నికల్లో ఓడించాలనీ, అభివృద్ధిని ఆకాంక్షించి పనిచేసే వారిని గెలిపించాలని సూచించారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సర్పంచులుగా ఎన్నికైతే ఆయా గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాజేందర్రావు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి తాండ్ర రాజశేఖర్, గుర్రం తిరుపతి రెడ్డి లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో వెలిచాల రాజేందర్రావు ఆధ్వర్యంలో చేరామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాజేంద్ర రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Read More మహా ధర్నా ఎవరికోసం? ఎందుకోసం?

About The Author