బీఆర్ఎస్ బిజెపి కనుమరుగు ఖాయం

- గ్రానైట్ పేరిట గత బిఆర్ఎస్ పాలకులు చీకటి దందా
- స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులదే గెలుపు
- కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల

WhatsApp Image 2025-12-09 at 6.48.52 PM

కరీంనగర్ : 

Read More నీటిపారుదలశాఖ రాష్ట్ర ఆడహక్ కమిటీ కన్వీనర్ సంగెం

సర్పంచ్ మొదలుకొని ఎంపీటీసీ జెడ్పిటిసితో పాటు ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి సుపరిపాలన గ్రామాలకు శ్రీరామరక్ష అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కరీంనగర్లో బిజెపి బీఆర్ఎస్ పార్టీలు కనుమరుగవుతాయని ఆరోపించారు. ఆయా పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బిఆర్ఎస్ బిజెపి దుకాణం బంద్ కాబోతుందని పేర్కొన్నారు.  కరీంనగర్ నియోజకవర్గంలో గ్రానైట్ పరిశ్రమ పేరిట గత బిఆర్ఎస్ పాలకులు కోట్లాది రూపాయల దోచుకుతిన్నారని మండిపడ్డారు.  మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెలిచాల రాజేందర్రావు మాట్లాడారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కరీంనగర్ రూరల్ మండలం కొత్తపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూపర్ సుపరి పాలన అందిస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. 8 లక్షల కోట్ల అప్పున్న ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయని చెప్పారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక మహత్తర పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ సన్నబియ్యం పంపిణీ రేషన్ కార్డులు అందజేత రైతు భరోసా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడం ఆర్టీసీలు అద్దె బస్సు అద్దె బస్సుల ను అందించి వాటికి యజమానులుగా చేయడం గ్రామాలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడం వంటి అనేక మహత్తరమైన అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్నారని రాజేందర్రావు తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలం కొత్తపల్లి మండలంలో 20 గ్రామాల్లో కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థులను ప్రజల అత్యధిక మెజార్టీతో గెలిపించడం ఖాయమని తాను పర్యటించిన సమయంలో ఇదే విషయాన్ని ప్రజలు వెల్లడించారని తెలిపారు. బావు పేటను గత బిఆర్ఎస్ పాలకులు గ్రానైట్ పేరిట అడ్డగా మార్చుకొని కోట్లాది రూపాయలు దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇకపై అలాంటి ఆటలు సాగవని దోపిడీకి పాల్పడే వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. వారి తాట తీయడం ఖాయమని హెచ్చరించారు. కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలబడాలని పేర్కొన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో బద్ది పెళ్లి బహుదూర్ఖాన్పేటలో పైలెట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కరీంనగర్ గడ్డను కాంగ్రెస్ అడ్డగా తీర్చిదిద్దుతానని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సర్పంచ్ తో పాటు ఎంపీటీసీ జెడ్పిటిసి ఏ ఎన్నిక వచ్చిన కాంగ్రెస్ పార్టీదే విజయం ఖాయమని కరీంనగర్ ను కాంగ్రెస్ అడ్డాగా తీర్చిదిద్దుతామని రాజేందర్ రావు వెల్లడించారు. కరీంనగర్ రూరల్ కొత్తపెళ్లి మండలాల్లో అన్ని గ్రామాలను సందర్శించానని సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు స్పష్టం చేశారని రాజేందర్రావు తెలిపారు. సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని అత్యధికంగా సర్పంచ్ స్థానాలను సాధించి తీరుతామని పేర్కొన్నారు.

Read More జాతీయస్థాయి కళాకారులకు సన్మానం

About The Author