రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమే

- ఎమ్మెల్యే చింత ప్రభాకర్

WhatsApp Image 2025-12-12 at 5.41.35 PM

సంగారెడ్డి : 
రెండు సంవత్సరాల తరువాత ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వమే,తిరిగి రానుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు.తాజాగా ఎన్నికైన నూతన సర్పంచ్‌లు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ని కలిశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. వారిని శాలువాతో సన్మాంచి పుష్ప గుచ్చం అందజేశారు.ఎమ్మెల్యే ను ఆయా గ్రామాల నూతన సర్పంచులు వెల్టూర్,  గిర్మాపూర్, బొబ్బిలి గామ, అనంతసాగర్, ఏటిగాడ్డ సంఘం, ముందేవునిపల్లి, శివన్న గూడెం కలిశారు.ప్రతి ఒక్కరూ అద్భుతంగా పని చేసి బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడంపై వారిని  ఎమ్మెల్యే అభినందించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి పని చేసిన విధానమే తిరిగి విజయం సాధించేందుకు దోహదం చేస్తుందని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేర్కొన్నారు.త్వరలో జరగబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో తిరిగి ప్రభుత్వాన్ని స్థాపించనున్నామని తెలిపారు.ప్రజల ఆశీర్వాదమే మాకు బలం.రానున్నది మన ప్రభుత్వమే అని వారు ధీమా వ్యక్తం చేశారు.గ్రామాల అభివృద్ధికి తన పూర్తి మద్దతు సహకారం ఉంటుందని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్ లు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 

About The Author