సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి :

సంగారెడ్డి పట్టణంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతుల మీదుగా అందజేశారు.రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయడంలో సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కృషితో రెండో స్థానంలో ఉంది.కొండాపూర్, కంది, సంగారెడ్డి టౌన్, సంగారెడ్డి మండలానికి చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకుఅందజేశారు.ఇందులో మొత్తం 61 చెక్కులు వాటి విలువ రూ.1428500 ఉందని అన్నారు.సదాశివపేట క్యాంపు కార్యాలయ ఆవరణలో సదాశివపేట పట్టణం, మండలానికి చెందిన మొత్తం 21 చెక్కులు వాటి విలువ 5,08,000 ఉందని పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు రావడానికి కృషిచేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూమధ్యవర్తులు లేకుండా నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరుకు దరఖాస్తు చేసుకోవాలి.అధికారం లేకున్న నేను సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యను నా సమస్యగా భావించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ లు కొండల్ రెడ్డి, పాండు పట్టణ కార్యదర్శి నర్సింలు, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, విఠల్,చక్రపాణి, వివిధ మండలాల మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
