సాయుధ దళాల నిధి సేకరణ ప్రారంభించిన కలెక్టర్

WhatsApp Image 2025-12-05 at 6.24.49 PM

సంగారెడ్డి : 
:
డిసెంబర్ 7వ తేదీన సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... సాయుధ దళాల పతాక నిధికి మొదటి విరాళాన్ని అందించినట్లు పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం యువత ముందుకు రావాలన్నారు. భారత సైనిక దళాల దేశభక్తి సాహసం త్యాగాలను ఈ సందర్భంగా కలెక్టర్ కొనియాడారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ ప్రకృతి వైపరీత్యాల సమయంలోను సైనికులు దేశం గర్వించేలా కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు. 

Read More జాతీయస్థాయి కళాకారులకు సన్మానం

About The Author