కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాలలో విజయం సాధిస్తారు

రాష్ట్ర టూరిజం అభివృద్ధి శాఖ చైర్మన్- పటేల్ రమేష్ రెడ్డి

WhatsApp Image 2025-12-01 at 5.25.26 PM

సూర్యాపేట : 

Read More రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2047 జూమ్ సమావేశం

త్వరలో నిర్వహించబోయే మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అందరూ అన్ని స్థానాలలో గెలుపొందుతారని రాష్ట్ర టూరిజం అభివృద్ధి శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మొదటి విడత నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గంలో 2 మండలాలు మొదటి విడతలో, మరిన్ని 2 మండలాలు రెండో విడతలో పూర్తిచేయనున్నట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించినట్లు వివరించారు. గ్రామాల్లోని ప్రజల్లో విశేష ఉత్సాహం కనిపిస్తోందని, ప్రతి గ్రామంలో 5 నుండి 15 మంది వరకు అభ్యర్థులు పోటీకి వస్తున్నారని రమేష్ రెడ్డి తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, ప్రజల ఇంటికే ప్రభుత్వ సేవలు చేరేలా పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు. గత 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలన తరువాత, మరోసారి రాజశేఖర్ రెడ్డి కాలం తరహాలో ప్రజలకు అనుకూలమైన, పారదర్శక పాలన ఇప్పుడు కొనసాగుతోందని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పేదలకు ఒక్క ఇల్లు అందకపోగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి, వేగంగా పనులు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, వడ్లకు బోనస్, ఉద్యోగాల భర్తీ వంటి కీలక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోందని తెలిపారు. నాణ్యతలేని చీరలు పంచిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా, కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన ఇందిరమ్మ చీరలు ప్రజలకు అందజేస్తోందని అన్నారు. కొన్ని గ్రామాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు కూడా పోటీకి రావడాన్ని వెనుకంజ వేస్తుండటం ప్రజల మారుతున్న అభిప్రాయానికి నిదర్శనమని పేర్కొన్నారు. అటువంటి చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎకగ్రీవం చేయాలని ప్రజలను కోరారు. గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను విజయవంతం చేయాలని పటేల్ రమేష్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 

Read More ర్యాండమైజేషన్ విధానంలో ఎన్నికల సిబ్బందికి కేటాయింపు

About The Author