
ములుగు జిల్లా :
ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ లో చేరిన కొత్త సభ్యుల చేతుల మీదుగా ములుగు జిల్లా కేంద్రంలో స్ట్రీట్ వెండర్స్కు నీడనిచ్చే పెద్ద లయన్స్ గొడుగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ములుగు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ దొంతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రోడ్లపై కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువులు అమ్ముకునే వ్యాపారులకు లయన్స్ పెద్ద గొడుగులు వారికి వర్షానికి ఎండకు ఉపయోగపడతాయని అన్నారు. లయన్స్ సభ్యుల సహకారంతో ఇక ముందు కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ములుగు లయన్స్ క్లబ్ సెక్రటరీ చుంచు రమేష్, కోశాధికారి ఆడెపు రాజు, పి జెడ్ సి సానికొమ్మ రవీందర్ రెడ్డి, ఫాస్ట్ ప్రెసిడెండ్స్ మెరుగు రమేష్, కొండి సాంబశివ, దొంతి రెడ్డి బలరాం రెడ్డి నూతన లయన్స్ సభ్యులు సోమ నరసయ్య, డాక్టర్ ఎం రాజా, రుద్రోజ్, వంశీ, రుద్రోజు ఆనంద్ గండ్రత్ శ్రీధర్ పెట్టెం రాజేందర్, ములుగు లయన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు