గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

WhatsApp Image 2025-12-01 at 6.31.23 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : 

Read More భూ నిర్వాసితులపై చిన్న చూపు చూస్తున్న సింగరేణి యాజమాన్యం.

గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియను లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
     
సోమవారం నిర్మల్ గ్రామీణ మండలంలోని కొండాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలోని పంచాయితీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
        
నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇక్కడ ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చిన వారితో మాట్లాడుతూ, నామినేషన్ కేంద్రంలో అన్ని వసతులు ఉన్నాయో లేవో వారిని అడిగి తెలుసుకున్నారు. నామినేషన్లు దాఖలు చేసే వారికి కుల ధ్రువపత్రాల జారి, బ్యాంకు ఖాతాలు తెరవడంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమో అడిగారు. అభ్యర్థుల సహాయార్థం  హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని అన్నారు. సిబ్బందితో మాట్లాడుతూ, హెల్ప్ డెస్క్ లో అందుబాటులో ఉంటూ, అభ్యర్థులకు సమాచారం ఇవ్వడంలో సహాయపడాలన్నారు. అధికారులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలని పేర్కొన్నారు. క్లస్టర్ లో ఇప్పటి వరకు దాఖలు అయిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ ల వివరాలు వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తి చేయాలని వివరించారు.  నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి అన్ని రకముల ఫారములను తగినన్ని అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. అన్ని రిజిస్టర్లను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. రోజువారీగా నామినేషన్లకు సంబంధించి వివరాలన్నింటినీ తమకు అందజేయాలని వివరించారు. ప్రతిరోజు దాఖలు అయిన నామినేషన్ల పత్రాలను జాగ్రత్తగా భద్రపరచాలని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
     
ఈ తనిఖీలో డిపిఓ శ్రీనివాస్, తహసిల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో ఎంపీడీవో గజానన్, ఎన్నికల అధికారులు, సిబ్బంది, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

Read More మాజీ ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసిన ఏకగ్రీవమైన సర్పంచ్ కేతిరి

About The Author