
సంగారెడ్డి :
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో నిఘా కట్టుదిట్టం చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం సదాశివపేట, కొండాపూర్ మండల పరిదిలో గల పలు సమస్యాత్మక, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి, ప్రచారం, గుర్తులను ప్రదర్శించడం నివారించాలని అన్నారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదరగొట్టాలని అన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, మరే ఇతరములు అక్రమ రవాణా జరగడానికి విలులేకుండా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని, విలేజ్ పోలీసు అధికారులు ఆయా గ్రామలపై నిఘా ఉంచి, ముందస్తు సమాచారాన్ని సేకరించి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలిగే శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు అని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ స్వేచ్చా ఓటు హక్కును వినియోగించి, ప్రజాస్వామ్యానికి బాటలు వేయాలని ఎస్పీ గారు సూచించారు.ఈ సందర్శనలో ఎస్పీవెంబడి సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, కొండాపూర్-ఎంఆర్ఓ,ఇన్స్పెక్టర్స్ వెంకటేశ్, సుమన్ కుమార్ ఎస్ఐ సోమేశ్వరి తదితరులు ఉన్నారు.