వంతెన మరమ్మత్తు.. వాహనాలు మళ్లింపు

ములుగు జిల్లా ప్రతినిధి :
ములుగు జిల్లా మల్లం పల్లి మండల కేంద్రం పరిధిలోని 163వ జాతీయ రహదారిలో నేడు (శుక్రవారం), రేపు (శనివారం) ఉదయం 9.30 గంటల 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుండి 4.30 గంటల వరకు వంతెన మరమ్మత్తు కొరకు ట్రక్స్, లారీలు, బస్సులు వ్యాన్లు, వాహనాలను గూడెంపాడు వయా పరకాల రేగొండ గాంధీనగర్ జంగాలపల్లి ద్వారా ట్రాఫిక్ మళ్లింపు చేయడం జరుగుతుందని, వాహనదారులు సూచనలు పాటించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
About The Author
16 Jan 2026
