
వేములవాడ :
నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్ లో డస్ట్ తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్ కి తరలించినట్లు వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపారు. గురువారం వేములవాడ పట్టణ పరిధిలోని తిప్పపూర్ బస్టాండ్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిబంధనలకు విరుద్ధంగా నిర్లక్ష్యంగా టిప్పర్ లో డస్ట్ తరలిస్తు ఇతర వాహనాలకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్ కి తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని,భారీ వాహనాల్లో డస్ట్, గ్రావెల్, కంకర తరలించే సందర్భల్లో ప్రజలపై పడకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని లేని యెడల చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏఎస్పి హెచ్చరించారు.